
📌 Key Points
- బాలకృష్ణ చేయాల్సిన ప్రాజెక్ట్ రవితేజ ఖాతాలోకి వెళ్ళినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
- నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK111 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు, హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్నారు.
- వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ సినిమాతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.
- బాలయ్య ఇమేజ్‌కు సరిపోయే మాస్, ఎమోషనల్ కథను వివేక్ సిద్ధం చేశాడని సమాచారం.
సినీ వర్గాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ఖాతాలోకి వెళ్ళిందని వార్తలు వినిపిస్తున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఆగిపోవడానికి గల కారణాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ వార్త వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం.
బాలయ్య కెరీర్ ఫుల్ స్వింగ్‌లో
Ravi Teja : ఒకరికి దక్కాల్సిన అవకాశం మరొకరికి దక్కడం సహజం, ఇక సినీ ఇండస్ట్రీలో అది మరీ సహజం.. గతంలో ఇలా ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు హీరోలు మారి సూపర్ హిట్లు అయ్యాయి కూడా. తాజాగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చేయాల్సిన ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్, ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ ఖాతాలోకి వెళ్లిందని. . నటనలోనూ, బాడీ లాంగ్వేజ్‌లోనూ కంప్లీట్ వేర్వేరు స్టైల్ మెయింటేన్ చేసే ఈ ఇద్దరు హీరోల మధ్యలో ఒకే కథ అటూ ఇటూ తిరగడం ఫిలిమ్ సర్కిల్స్ లో ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది.
NBK111 షూటింగ్‌లో బిజీ బిజీగా బాలయ్య
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సంగతి తెల్సిందే.అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఆయన క్రేజ్ అమాంతం ఆకాశానికి చేరింది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 111వ సినిమా (NBK111) షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు.. 2023 సంక్రాంతికి వచ్చిన ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కూడా. ఇక ఈ లైనప్ ఇలా ఉండగానే, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారనే వార్త గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
వివేక్ ఆత్రేయ విజయం, కొత్త కథ
మెస్మరైజ్ చేసిన సరిపోదా శనివారం
గతేడాది నాని హీరోగా వచ్చిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో వివేక్ ఆత్రేయ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశాడు.కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కొత్త తరహా స్క్రీన్‌ప్లే జోడించి ఆయన అందుకున్న సక్సెస్ ఇండస్ట్రీని మెస్మరైజ్ చేసింది.ఈ క్రమంలోనే బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, ఆయన ఇమేజ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఒక క్రేజీ మాస్ అండ్ ఎమోషనల్ స్టోరీని సిద్ధం చేశాడట వివేక్ .
ఇక దీనికి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ మైత్రి మూవీ మేకర్స్ సమక్షంలో జరిగాయి కూడా.పైగా బాలయ్యకు కూడా లైన్ బాగా నచ్చడంతో ఈ క్రేజీ కాంబినేషన్ దాదాపు ఖాయమని, టైటిల్ కురుక్షేత్రం అని నెట్టింట్లో తెగ సర్క్యులేట్ అయింది కూడా.అయితే తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండానే ఆగిపోయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వరుసగా ఒప్పుకున్న మిగతా సినిమాల కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే వివేక్ ఆత్రేయ సినిమాకు బ్రేక్ పడిందని ఇన్ సైడ్ టాక్.
రవితేజ ఖాతాలోకి వెళ్ళిందా?
బాలయ్య కథ రవితేజకి ఎలా నప్పుతుందో
అయితే ఆ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను ఎత్తి పరిస్థితుల్లో తెరకెక్కించాలని ఫిక్స్ అయిన వివేక్ మాస్ మహారాజా రవితేజ ని అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది.కథ విన్న రవితేజ క్యారెక్టరైజేషన్ నచ్చి వెంటనే సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశాడని సమాచారం. రవితేజ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ మార్క్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది మైత్రి మేకర్స్.
ఇక ప్రస్తుతం రవితేజ తన సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ సినిమా షెడ్యూల్స్ ముగిసిన వెంటనే, వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య మార్క్ భారీతనం కోసం రాసుకున్న కథలో రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా వివేక్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తున్నట్లు వినిపిస్తుంది. చూడాలి మరి బాలయ్య వదులుకున్న ఈ కథ రవితేజకి ఎలా నప్పుతుందో !
బాలకృష్ణ, వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ ఆగిపోయి రవితేజ వద్దకు వెళ్ళిందనే వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామం టాలీవుడ్‌లో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందో లేదో చూడాలి.


