
షూటింగ్ ప్రారంభం కాకముందే బాలీవుడ్ సూపర్ హిట్ రివేంజ్ థ్రిల్లర్ బద్లాపూర్ సీక్వెల్ ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. జాన్వీ కపూర్, రష్మిక మందన్నా సినిమాలు కూడా ఇందులో భాగమే.
Key Points
షూటింగ్ మొదలుకాకముందే బద్లాపూర్ 2 ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది.
మడాక్ ఫిల్మ్స్ 2025-2027 మధ్య తమ సినిమాల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్‌కు అమ్ముకుంది.
జాన్వీ కపూర్ 'పరమ్ సుందరి', రష్మిక మందన్నా 'థామా' కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదల కానున్నాయి.
ఈ ఒప్పందం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది.
బద్లాపూర్ 2 ఓటీటీ రిలీజ్
ఓటీటీలోకి సినిమాలు సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత వస్తాయి. లేదా నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాగే, ఓ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అవుతుంది. కానీ, ఇక్కడ ఊహించని విధంగా అసలు షూటింగే మొదలుపెట్టని సినిమాకు ఓటీటీ ఫిక్స్ అయిపోయింది.
ఆ సినిమానే బద్లాపూర్ 2. 2015లో హిందీలో రొమాంటిక్ రివేంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా బద్లాపూర్. వరుణ్ ధావన్, యామీ గౌతమ్, నవాజుద్ధీన్ సిద్ధిఖి, రాధిక ఆప్టే నటించిన బద్లాపూర్ సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఈ సినిమాకు పదేళ్ల తర్వాత సీక్వెల్ రానుంది.
అదే బద్లాపూర్ 2. బద్లాపూర్‌కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఇంతలోనే బద్లాపూర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో థియేట్రికల్ రిలీజ్ తర్వాత బద్లాపూర్ 2 ఓటీటీ రిలీజ్ కానుంది.
మడాక్ ఫిల్మ్స్-అమెజాన్ ప్రైమ్ ఒప్పందం
అయితే, బద్లాపూర్ సినిమాను తెరకెక్కించిన మాడాక్ ఫిల్మ్స్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో ఈ డీల్ కుదుర్చుకుంది. బద్లాపూర్ 2 సినిమా మాత్రమే కాకుండా మడాక్ ఫిల్మ్స్ సంస్థలో 2025 నుంచి 2027 మధ్య థియేటర్లలో విడుదలయ్యే సినిమాలన్నింటికి ప్రైమ్ వీడియోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా డీల్ ఫిక్స్ అయింది.
దీనికి సంబంధించిన అప్డేట్‌ను తాజాగా మడాక్ ఫిల్మ్స్ ప్రకటించింది. అంటే, రెండేళ్లపాటు తమ బ్యానర్‌లో వచ్చే సినిమాల ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియోతో కొనుగోలు చేసేసింది బాలీవుడ్ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ నటించిన పరమ్ సుందరి ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా అమెజాన్ ప్రైమ్‌గా ఫిక్స్ అయింది.
అలాగే, రష్మిక మందన్నా హారర్ థ్రిల్లర్ థామా ఓటీటీ కూడా అమెజాన్ ప్రైమ్ కావడం విశేషం. ఇలా వరుణ్ ధావన్ బద్లాపూర్ 2, జాన్వీ కపూర్ పరమ్ సుందరి, రష్మిక మందన్నా థామా అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ చేసేందుకు మడాక్ ఫిల్మ్స్ ఒప్పందం కుదుర్చుకుని కొత్త ట్రెండ్ సెట్ చేసింది.
జాన్వీ, రష్మిక సినిమాల ఓటీటీ విడుదల
ఈ మూడు సినిమాలతోపాటు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆగాస్త్య నంద నటించిన ‘ఇక్కీస్’ కూడా థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ కానుంది.
కాగా, జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన రొమాంటిక్ కామెడీ డ్రామా పరమ్ సుందరి ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఇక రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్ధీన్ సిద్ధిఖి నటించిన థామా అక్టోబర్ 21 దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ ఒప్పందం తెలుగు సినీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశం. బద్లాపూర్ 2తో పాటు జాన్వీ, రష్మిక సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్నాయి కాబట్టి ప్రేక్షకులకు ఉత్కంఠ పెరిగింది.

