|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT: షారుఖ్ ఖాన్ కొడుకు డైరెక్షన్.. బాలీవుడ్ అంతా ఒకే సిరీస్‌లో

Published: 08-09-2025, 6:44 AM
OTT: షారుఖ్ ఖాన్ కొడుకు డైరెక్షన్.. బాలీవుడ్ అంతా ఒకే సిరీస్‌లో

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో ఆమిర్ ఖాన్, రాజమౌళి వంటి ప్రముఖులు కనిపించనున్నారని తెలుస్తోంది.

Key Points

1

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ దర్శకత్వంలో 'ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్

2

నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 18 నుంచి స్ట్రీమింగ్

4

హిందీ చిత్ర పరిశ్రమలోని తెరవెనుక కథలతో కూడిన కామెడీ ఎంటర్‌టైనర్

ఆర్యన్ ఖాన్ దర్శకత్వం

రాజమౌళి పేరు చెప్పగానే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ మధ్య కాలంలో యాడ్స్, ఈవెంట్స్‪‌లో తరుచుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఓ హిందీ వెబ్ సిరీస్‌లోనూ జక్కన్న నటించడం విశేషం. తాజాగా రిలీజైన ట్రైలర్‌తో ఈ విషయం బయటపడింది.

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల

బాలీవుడ్ ప్రముఖుల పాత్రలు

షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్.. దర్శకుడిగా మారి తీసిన సిరీస్ ‘ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’. హిందీ చిత్రసీమలో తెరవెనక జరిగే సంగతుల్ని ఆధారంగా చేసుకుని కామెడీ ఎంటర్‪‌టైనర్‌గా దీన్ని తీశాడు. సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనే ఓ సీన్‌లో ఆమిర్ ఖాన్, రాజమౌళి కనిపించారు. వీళ్లతో పాటు దర్శకనిర్మాత కరణ్ జోహార్, దిశా పటానీ, షారుఖ్ ఖాన్, ర్యాపర్ బాద్ షా కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.

మొత్తంమీద, ‘ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ సిరీస్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉండబోతుందని ట్రైలర్ సూచిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ను తప్పకుండా చూడండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.