|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT: ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ రివ్యూ

Published: 05-07-2025, 8:45 AM
OTT: ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ రివ్యూ

ఓటీటీలో విడుదలైన ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ సిరీస్ మూఢనమ్మకాల నేపథ్యంలో సాగుతుంది. 1980ల ఒంగోలులోని గ్రామంలో పెళ్ళికూతుళ్ళు చనిపోవడం, కానిస్టేబుల్ మీనా విచారణ ఇందులోని ముఖ్యాంశాలు.

Key Points

1

1980లలో ఒంగోలు ప్రాంతంలోని ఓ గ్రామంలో పెళ్ళికూతుళ్ళు మృత్యువాత పడటం.

2

కానిస్టేబుల్ మీనా చేపట్టిన విచారణ మరియు ఆమె ప్రమాదకరమైన నిర్ణయం.

4

ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం.

కథాంశం: మృత్యువుతో కూడిన పెళ్ళిళ్ళు

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో ‘విరా‍టపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌ గురించి తెలుసుకుందాం.

మనిషి మనుగడకు నమ్మకమే పునాది. మనం నమ్మిన సిద్ధాంతమే మనల్ని నడిపిస్తుంది. కానీ ఆ నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోజుల్లో కూడా మూఢనమ్మకాల వల్ల చాలా చోట్ల జరగరానివి జరుగుతుండడం ఆందోళనకరం. మూఢనమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేదే ‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’(Viraatapalem PC Meena Reporting) సిరీస్‌. జీ5 వేదికగా స్ట్రీమ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ కథాంశమంతా దాదాపు మూఢనమ్మకాల మీదే కొనసాగుతుంది. అలాగే సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఉత్కంఠ రేపుతుందనడంలో సందేహం లేదు.

మీనా విచారణ: సత్యం వెతుకులాట

ఇక కథాంశంలోకి వస్తే… 1980 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగిన కథే ఈ సిరీస్‌. ఆ ఊరిలో పెళ్ళైన మొదటిరాత్రే పెళ్ళికూతుళ్ళు రక్తపు వాంతులు చేసుకుని చనిపోతుంటారు. దాదాపు పది సంవత్సరాల నుండి ఇలానే ఊళ్ళో జరగడం చూసి ఊళ్ళోని జనాలు తమ ఊరికి పెద్ద శాపం తగిలిందనుకుని కుమిలి΄ోతుంటారు. అంతేకాదు… ఆ ఊళ్ళో పెళ్ళి చేసుకోవడానికి కూడా జంకుతుంటారు. ఇదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్‌ మీనా కొత్తగా ట్రాన్స్‌ఫరై వస్తుంది. ఇలా పెళ్ళి కూతుళ్ళు చనిపోవడం చూసి మీనా దీనిపై విచారణ ప్రారంభిస్తుంది. ఒక దశలో విచారణ ఏదీ కొలిక్కి రానందున తానే పెళ్ళి పీటలెక్కి విచారణను వేగవంతం చేస్తుంది.

ఉత్కంఠ మరియు ట్విస్టులు

పెళ్ళి చేసుకోబోతున్న మీనా కూడా తాళి కట్టించుకున్న తరువాత రక్తపు వాంతులు చేసుకుంటుంది. ఆ తరువాత కథ అనుకోని మలుపులు తిరుగుతుంది. మరి…  పెళ్ళి కూతురు అయిన మీనా ఈ కేసును సాల్వ్‌ చేయగలిగిందా? అసలు ఈ పెళ్ళి కూతుళ్ళు చని΄ోవడానికి కారణం ఆ ఊరికి పట్టిన శాపమేనా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ‘విరాట΄ాలెం–పీసీ మీనా రి΄ోర్టింగ్‌’ సిరీస్‌ చూడాల్సిందే. చిన్న కథతో ఉత్కంఠ రేపే ΄ాయింట్‌తో ఊహకందని ట్విస్టులతో ప్రేక్షకుడిని ఉర్రూతలూగించే ఈ సిరీస్‌ చూడదగినదే. పిల్లలు లేకుండా పెద్దలు చూడగలిగే ఈ సిరీస్‌ వాచబుల్‌ ఫర్‌ ది వీకెండ్‌. – హరికృష్ణ ఇంటూరు

‘విరాటపాలెం–పీసీ మీనా రిపోర్టింగ్‌’ సిరీస్ చూడటం ద్వారా, మూఢనమ్మకాల ప్రమాదకరతను అర్థం చేసుకోవచ్చు. ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను అలరిస్తుంది.

Related News

సమంత మాస్ విధ్వంసం! 'మా ఇంటి బంగారం' 4 రోజుల్లో రూ.50 కోట్లు షాక్! వంద కోట్ల టార్గెట్ ఫిక్స్!
దళపతి విజయ్ కి మెగా షాక్! త్రిష మౌనం... సూపర్ స్టార్ రజినీకాంత్ పై ట్రోలింగ్ రచ్చ! అసలు కారణం ఇదేనా?
మహేష్ బాబు షాకింగ్ అనౌన్స్‌మెంట్: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ! మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడ?
వైరల్ సంచలనం! విజయ్-త్రిష బంధానికి బిగ్ బ్రేక్? ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. అసలు కథ ఇదే!
షాకింగ్ న్యూస్: భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్‌లో రికార్డు సృష్టిస్తుందా? మోహన్‌లాల్‌తో ఊహించని ఎంట్రీ!
రామ్ చరణ్ సినిమాలపై నట్టి కుమార్ మాస్ అప్డేట్! 'పెద్ది' కలెక్షన్ల నిజాలు.. 'గేమ్ ఛేంజర్' తప్పులు.. వైరల్ టాక్!
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.