|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పదేపదే నాలుక కరుచుకోవడం: శుభమా? అశుభమా? జ్యోతిష్య విశ్లేషణ

Published: 18-04-2025, 5:40 AM
పదేపదే నాలుక కరుచుకోవడం: శుభమా? అశుభమా? జ్యోతిష్య విశ్లేషణ

నాలుక కరుచుకోవడం సర్వసాధారణం అయినా, జ్యోతిష్య శాస్త్రం దీనికి వివిధ అర్థాలను అందిస్తుంది. హఠాత్తుగా లేదా పదేపదే నాలుక కరుచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Key Points

1

హఠాత్తుగా నాలుక కరుచుకోవడం ప్రమాద సూచన కావచ్చు.

2

పదేపదే నాలుక కరుచుకోవడం నోరు అదుపులో ఉంచుకోవాలని సూచిస్తుంది.

4

నిద్రలో నాలుక కరుచుకోవడం మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలని సూచిస్తుంది

హఠాత్తుగా నాలుక కరుచుకోవడం

అప్పుడప్పుడు మనం పొరపాటున నాలుక కరుచుకుంటూ ఉంటాము. ఏదైనా మాట్లాడేటప్పుడు లేదా తినేటప్పుడు నాలుక కరుచుకుంటూ ఉంటాము. నాలుక కరుచుకోవడం చాలా సర్వసాధారణమే. కానీ నాలుక కరుచుకోవడం వెనుక సంకేతాలు ఏంటో జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.

జ్యోతిష్యం ప్రకారం నాలుక కరుచుకోవడం వెనక కూడా అర్థం ఉంది. కలలో నాలుగు కరుచుకున్నట్లు కనపడితే కూడా దాని వెనుక ఎంతో పెద్ద అర్థం ఉందట. వీటి వెనక అర్థం ఏంటి? జ్యోతిష్య నిపుణులు ఏం చెప్పారు వంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.

1.హఠాత్తుగా నాలుకని కరుచుకోవడం

హఠాత్తుగా నాలుకని కరుచుకున్నట్లైతే త్వరలో ఏదో ప్రమాదం రావచ్చని అర్థం. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

పదేపదే నాలుక కరుచుకోవడం

చాలా కొద్ది సమయంలోనే ఒకసారి కంటే ఎక్కువ సార్లు నాలుక కరుచుకున్నట్లయితే క్రమశిక్షణతో మీరు లేరని అర్థం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదేపదే తప్పులు చేయకుండా చూసుకోవాలి. తప్పు నుంచి నేర్చుకుని వాటిని మళ్లీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి.

పదేపదే నాలుకని కరుచుకుంటూ ఉంటున్నట్లయితే నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరికీ కూడా ఎటువంటి రహస్యాలని చెప్పకూడదు. వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి. ఎవరు వెనక కూడా మాట్లాడకండి.

నాలుకని కరుచుకున్నట్లయితే ప్రతికూలత నుంచి సానుకూల వైపుకు వెళ్తున్నారని ఇది సంకేతం కావచ్చు. ఇదివరకు కంటే ప్రశాంతంగా, సానుకూలంగా ఉన్న సమయంలో ఇలా జరగవచ్చు. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటూ మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

నిద్రలో నాలుక కరుచుకోవడం

తింటున్నప్పుడు పదేపదే నాలుకని కరుచుకుంటే సహనం తగ్గిందని సహనాన్ని అలవాటు చేసుకోవాలని అర్థం.

నిద్రపోయినప్పుడు నాలుకని కరుచుకుంటే మీరు మీ మాటల్ని అదుపులో ఉంచుకోవాలి. మీ మాటలు ఇతరులని బాధ పెడుతున్నాయని అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు తక్కువ మాట్లాడటం మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

నాలుక కరుచుకోవడం వెనుక అనేక అర్థాలున్నాయని జ్యోతిష్యం చెబుతుంది. జాగ్రత్తగా ఉండటం, నోరు అదుపులో ఉంచుకోవడం, సహనం పెంచుకోవడం చాలా ముఖ్యం.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.