|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్: వేడుకల్లో మునిగిన అభిమానులు! ఆయన సంతోషానికి అవధుల్లేవ్!

Published: 25-01-2026, 10:05 AM
మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్: వేడుకల్లో మునిగిన అభిమానులు! ఆయన సంతోషానికి అవధుల్లేవ్!
  • 2026 సంవత్సరానికి గాను 113 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
  • సినీ రంగంలో విశేష కృషి చేసినందుకు మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం.
  • పద్మభూషణ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మమ్ముట్టి.. దేశ గౌరవం కంటే గొప్పది లేదన్న ఆయన.
  • గత 55 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న మమ్ముట్టి ప్రస్థానం.

కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది. సినీ రంగంలో విశేష కృషి చేసిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ లభించింది. ఈ సందర్భంగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

మెగాస్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ పురస్కారం

Padma Awards 2026: కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారాలలో భాగంగా 2026వ సంవత్సరానికి గాను దాదాపు 113 మంది ఈ పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. అందులో ప్రత్యేకంగా 11 మంది తెలుగువారు ఉండగా.. అటు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అందులో భాగంగానే 74 సంవత్సరాల వయసులో మెగాస్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉనికిని చాటుకుంటూ మెగాస్టార్ గా అవతరించారు మమ్ముట్టి.. మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడుగా కొనసాగుతున్న ఈయన ఇటు తెలుగులో కూడా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వాసుకి , గ్యాంగ్స్ ఆఫ్ 18,స్వాతికిరణం, లాయర్ ది గ్రేట్, సూర్య ది గ్రేట్, యాత్ర, ఏజెంట్ వంటి తెలుగు చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోగా మారిపోయారు. వీటిల్లో ముఖ్యంగా ‘యాత్ర’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ఆధారంగా వచ్చిన యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. ఈ పాత్రలో నటించిన మమ్ముట్టిని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారనే చెప్పాలి.

పద్మభూషణ్ పై మమ్ముట్టి సంతోషం, స్పందన

ఇకపోతే 1971లో విడుదలైన మలయాళం చిత్రం ‘అనుభవంగల్ పాలిచకల్’ అనే చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న పాత్ర పోషించి తన కెరీర్ ను ఆరంభించారు. అయితే 1980లో వచ్చిన ‘విల్కనుండు స్వప్నన్గల్’ అనే చిత్రంతో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. అలా మొదలైన ఆయన సినీ ప్రస్థానం గత 55 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ప్రకటించారు.

ఇకపోతే తనకు ఈ పద్మ భూషణ్ అవార్డు వరించడం పై మమ్ముట్టి స్పందిస్తూ.. “నేను తిరువనంతపురంలో ఒక సినిమా అవార్డును అందుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకటన వచ్చింది. ఈ వార్త విని నాకు మరింత సంతోషంగా అనిపించింది. దేశం నుండి వచ్చే గౌరవం కంటే గొప్పది ఏదీ లేదు” అంటూ తనకు పద్మభూషణ్ రావడం పై స్పందించారు.. ఇక ఈ విషయం తెలిసి అటు అభిమానులు సినీ ప్రముఖులు మమ్ముట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..

తెలుగులో మమ్ముట్టి సినిమాలు, ఆయన ప్రస్థానం

ఇకపోతే మమ్ముట్టి ఈ 55 ఏళ్ల సినీ ప్రస్థానంలో అందుకున్న అవార్డుల విషయానికి వస్తే.. 3 ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డులు, 11 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 11 కేరళ రాష్ట్ర చలనచిత్ర విమర్శకుల అవార్డులు, 15 ఫిలిం ఫేర్ సౌత్ అవార్డులు లభించాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మరియు మస్కట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా మమ్ముట్టి సత్కరించబడ్డారు. ఇకపోతే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును 1998లో అందుకున్న ఆ తర్వాత 2022లో కేరళ ప్రభుత్వం నుండి కేరళ ప్రభ అవార్డును అందుకున్నారు. అలాగే కాలికట్ విశ్వవిద్యాలయం, కేరళ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లను కూడా అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇన్ని ఏళ్లకు పద్మభూషణ్ అవార్డు లభించింది.

మమ్ముట్టికి పద్మభూషణ్ రావడం ఆయన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆయన మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.