
📌 Key Points
- ఇజ్రాయెల్ ప్రతిపాదిత ‘హెక్సాగన్ అలయన్స్’ పట్ల పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది.
- భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు ముస్లిం ఓట్ల రాజకీయాల కంటే దేశ రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నాయి.
- ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మధ్య ఆసియాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి.
- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా, ఇరాన్‌కు సహాయం చేయలేని స్థితిలో ఉంది.
ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ‘హెక్సాగన్ అలయన్స్’ విషయంలో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కూటమిలో భారతదేశం భాగస్వామి కావడం పాకిస్తాన్‌ను కలవరానికి గురిచేస్తోంది. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ సెనేట్‌లో తీర్మానం కూడా చేశారు. దీనిపై ప్రపంచ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హెక్సాగన్ అలయన్స్‌తో పాకిస్తాన్‌కు ముప్పు?
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన చేయడం, నిబంధనలకు విరుద్ధంగా నెతన్యాహూ దంపతులు అపూర్వ స్వాగతం పలకడం, ఆ దేశ అత్యున్నత పురస్కారం అందించడం పాకిస్తాన్ పాలకులను, దేశంలోని మోడీ వ్యతిరేకులను కలవర పెట్టింది. అలాగే ఇజ్రాయిల్ ప్రతిపాది స్తున్న ‘హెక్సాగన్ అలయన్స్’లో భారతదేశం భాగస్వామి కావడంపై ఆ దేశం తీవ్ర ఆందోళనకు గురి అవుతోంది..
ఈ అలయన్స్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ సెనేట్‌లో తీర్మానం చేయడం ప్రపంచ రాజకీయ విశ్లేషకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దీన్ని ‘యాంటీ ముస్లిం ఉమ్మా’గా పేర్కొనడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇజ్రాయిల్‌తో భారత్ సత్సంబంధాలను కొనసాగించడం ముస్లిం దేశాల కంటే, భారతదేశంలో ముస్లింల ఓట్ల కోసం ఆరాటపడే రాజకీయ నాయకులకు ససేమిరా ఇష్టం ఉండదు.. అందుకే గత ప్రభుత్వాలు ఇజ్రాయెల్‌ను దూరంగా పెడుతూ వచ్చాయి.. ముస్లిం ఓటర్ల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వాలు అలా నడుచుకున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం ఆ దేశంతో అనేక రక్షణ ఒప్పందాలను కుదుర్చు కోవడంతో ప్రపంచంలోని ముస్లిం దేశాల కంటే పాకిస్తాన్ చాలా ఇబ్బందికి గురైనట్లుంది. ఎందుకంటే భారత్, ఇజ్రాయెల్ కలిసిపోతే అమెరికా భారత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని ఆ పాలకులు భయపడుతున్నారు.. వాస్తవంగా అనేక దేశాలు తన రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఒప్పందాలు చేసుకోవడం సహజ పరిణామం. నాటో కూటమి, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్, ఓపెక్, ఓఐసీ వంటివి వివిధ దేశాల సమూహాలతో ఇలా ఏర్పడినవే.. ఇజ్రాయెల్ ప్రతిపాదించిన హెక్సాగన్ అలయన్స్ కూడా ఈ కోవలోనికే వస్తుంది. ఇవన్నీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పడే కూటములు..
భారత్-ఇజ్రాయెల్ సంబంధాల వెనుక వ్యూహం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడడం మధ్య ఆసియా శాంతి భద్రతల పరిస్థితికి గొడ్డలి పెట్టే.. ఇరాన్‌కు రష్యా మిత్ర దేశమైనప్పటికీ సహాయం చేసే పరిస్థితుల్లో లేదు.. అది ఉక్రెయిన్ యుద్ధంతో తల్లడిల్లుతుంది. పైగా ఇరాన్, అమెరికా సంఘర్షణలు రష్యా చమురు ధరలకు రెక్కలు లొచ్చేటట్లు చేస్తాయనే విషయం రష్యాకు బాగా తెలుసు.. ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉండడం వల్లనే మధ్య ఆసియాలో ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి క్షిపణులు ప్రయోగించి, ప్రపంచ యుద్ధానికి దారులు పరిచినట్లయింది. అమెరికా మీద ఉండే కోపంతో ఇరాన్ సైన్యం గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేసులపై దాడులకు దిగడంతో పరిస్థితులు భయానకంగా మారాయి. ఇరాన్‌లో ఆయాతుల్లా ఖమేనీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులను, స్త్రీల హక్కుల గురించి మాట్లాడే వారిని అనేక క్రూర హింసలకు గురి చేసింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాల్సిందే! కానీ ఒక సార్వభౌమాధికార దేశంపై దాడులకు తెగబడి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులను మట్దుబెట్టడం దురహంకార పూరితమే.. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ పేరుతో ఇతర దేశాల వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు అమెరికాకు లేదు. అక్కడ ప్రభుత్వాన్ని ఎవరు నడపాలనేది ఆ దేశంలోని ప్రజలు, మేధావులు నిర్ణయించాల్సిన విషయం. ఈ విషయంలో అమెరికాకు ఎటువంటి హక్కు లేదు..
మొన్న వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ ముదురోను బందీని చేసి, అమెరికాకు తరలించడం వెనుక ఆ దేశంలోని ప్రతిపక్ష నాయకులు, మేధావులు, పత్రికా ప్రతినిధులు ప్రజాస్వామ్య ఉద్యమకారులు అమెరికాకు సహకరించినట్లే ఇరాన్‌ను 1979లో పరిపాలించిన షా కుటుంబ ప్రతినిధి, యువరాజు రెజా పహ్లవి ప్రజాస్వామ్య, సెక్యులర్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆ దేశ ప్రతిపక్ష నాయకులను, ప్రజాస్వామ్య హితైషులను కోరడం వెనుక అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా గల్ఫ్ దేశాల సహాయ సహకారాలు లేకుండా అమెరికా, ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడలేవు.. ఇక్కడ గల్ఫ్ దేశాలు కూడా తమ సొంత రాజకీయ, ఆర్థిక, రక్షణ అవసరాలను చూసుకున్నాయనే విషయం స్పష్టమైంది. ఇస్లామిక్ రెవల్యూ షనరీ ఆర్మీ అమెరికా ఎయిర్ బేసులపై దాడుల సొడ్డుతో గల్ఫ్ దేశాల ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వెనుక ఈ రహస్యమే దాగి ఉంది! పైగా ‘షియా, సున్నీ’ రాడికల్స్ గ్రూపుల ప్రభావాన్ని అడ్డుకోవాలని గల్ఫ్ దేశాల రాజకీయ నాయకత్వం కృతనిశ్చయంతో ఉంది.
మధ్య ఆసియాలో మారుతున్న రాజకీయ పరిస్థితులు
ఇక ముస్లిం దేశాలలో చోటు చేసుకుంటున్న సంఘటనలకు భారతదేశంలోని కుహనా లౌకికవాదులూ, వారికి గుండు గుత్తగా మారిన ఇస్లాం సమాజం అతిగానే ప్రతిస్పందిస్తుంది. 52 ఇస్లామిక్ దేశాలలో పాకిస్తాన్ తప్పించి మరి ఎక్కడ ఇరాన్ సంఘటనలపై నిరసనలు కనబడలేదు.. వినబడలేదు. కానీ భారతదేశంలో ఈ నిరసన రూపురేఖలు భవిష్యత్తులో ఎలా మారుతాయో ఇప్పుడే చెప్పలేం. ఇక ఇరాన్ సంఘర్షణ వల్ల భారతదేశానికి చమురు దిగుమతుల సమస్య ఏర్పడి, దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు.
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
మొత్తానికి, హెక్సాగన్ అలయన్స్ ప్రాంతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారుతోంది. దీని ప్రభావం పాకిస్తాన్‌పై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.


