|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కాబూల్ రక్తపుటేరు: భారత్‌కు పాక్ సవాల్! ఆఫ్ఘన్ ప్రతీకార జ్వాల?

Published: 18-03-2026, 4:05 PM
కాబూల్ రక్తపుటేరు: భారత్‌కు పాక్ సవాల్! ఆఫ్ఘన్ ప్రతీకార జ్వాల?
  • కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడిలో 400 మందికి పైగా మృతి.
  • భారత్ ఖండించడంతో పాకిస్తాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
  • భారత్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోందని పాక్ ఆరోపణ.
  • పాకిస్తాన్ పై రివర్స్ ఎటాక్ చేసే అవకాశం ఉందని ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరిక.

కాబూల్ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దాడిని ఖండిస్తూ భారత్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదురు దాడికి సిద్ధమవుతోంది.

కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి

రెండు రోజుల కిందట ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ ఆసుపత్రిపై (Kabul strike) పాకిస్తాన్ ( Pakistan ) వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో దాదాపు 400 మంది అమాయకపు ప్రజలు మృతి చెందారు. రంజాన్ కంటే ముందు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ సంఘటనకు పాల్పడిన పాకిస్తాన్ పై అన్ని దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో ఇండియా కూడా ఈ దాడిని ఖండించింది. ఇది ప్రాంతీయ సుస్థిరతకు విఘాతం కలిగిస్తుందని.. పాకిస్తాన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత్ ఇప్పటికే ప్రకటన చేసింది.

కాబూల్ సంఘటనపై ఇండియా ( India ) రియాక్ట్ కావడంపై పాకిస్తాన్ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తమ దేశాన్ని విలన్ గా చూపించేందుకు ప్రతి నిత్యం భారత్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందని ఫైర్ అయింది పాకిస్తాన్. ఇందులో భాగంగానే కాబూల్ సంఘటనను ఎత్తి చూపించి తమపై బురద జల్లడం భారత ప్రారంభించిందని మండిపడింది.

భారత్ ఖండన, పాక్ కౌంటర్ ఎటాక్

ఈ సంఘటన ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని విమర్శలు చేసింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ పై తప్పుడు ప్రచారం మొదలుపెట్టిందని పాకిస్తాన్ విదేశాంగ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా కాబూల్ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది.

రివర్స్ ఎటాక్ చేసే ఛాన్స్?

A post shared by NEWS9 (@news9live)

కాబూల్ సంఘటన ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ముదురుతుండగా, ఆఫ్ఘనిస్తాన్ చర్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.