
భారత మహిళల క్రికెట్ స్టార్ స్మృతి మందాన పెళ్లి వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్‌తో ఆమె పెళ్లి జరగనున్నట్లు ప్రచారం సాగుతుండగా, తాజాగా ఈ విషయంపై పలాష్ స్పష్టత ఇచ్చారు. స్మృతి మందాన త్వరలో ఇండోర్‌కు కోడలిగా రానున్నారని ధృవీకరించారు.
Key Points
స్టార్ క్రికెటర్ స్మృతి మందనను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు పలాష్ ముచ్చల్ ధృవీకరించారు.
స్మృతి త్వరలో ఇండోర్‌కు కోడలిగా రానున్నారని పలాష్ ముచ్చల్ వెల్లడించారు.
గతంలో సోషల్ మీడియాలో స్మృతి మందన, పలాష్ ముచ్చల్లపై పెళ్లి రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి.
పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
పెళ్లి వార్తలపై పలాష్ ముచ్చల్ స్పందన
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మతికి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. అవును.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.
గతంలో వైరల్ అయిన రూమర్స్
కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం ‘రాజు బజేవాలా’మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.
పలాష్ ముచ్చల్ కెరీర్, క్రికెట్ శుభాకాంక్షలు
తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు’ తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు.
పలాష్ ముచ్చల్ తన కెరీర్, క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూనే, స్మృతితో తన పెళ్లి వార్తలను ధృవీకరించడం అభిమానుల్లో ఆనందం నింపింది. ఈ సెలబ్రిటీ జంట పెళ్లిపై పూర్తి వివరాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


