
జీవితంలో సంతోషం, విజయం కోరుకునే ప్రతి ఒక్కరికీ, వారి రాశికి అనుగుణంగా ప్రత్యేక మంత్రాలు, దేవతల ఆరాధన విధానాలు ఉన్నాయి. ఈ కథనంలో ప్రతి రాశికి సరిపోయే మంత్రాలు, ఆచరణా విధానాలను తెలుసుకుందాం.
Key Points
ప్రతి రాశికి ప్రత్యేకమైన మంత్రాలు, దేవతల ఆరాధన ఉంది.
మంత్రాల జపనం ద్వారా సంతోషం, విజయాలను పొందవచ్చు.
నమ్మకంతో జపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
రాశులకు అనుగుణంగా మంత్రాలు
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, జీవితంలో ఏ సమస్య రాకుండా ఉండాలని అనుకుంటారు. అయితే రాశుల ఆధారంగా ఏ రాశి వారికి ఏ మంత్రాలు చదవడం వలన కలిసి వస్తుందో, సంతోషంగా ఉండవచ్చో తెలుసుకుందాం.
మొత్తం అన్ని రాశులకు ఆ రాశి అధిపతులు ఉంటారు. వాటి ఆధారంగా ఎవరికి ఏం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి ని కుజుడు పాలిస్తాడు. ఈ రాశి వారు ఆంజనేయస్వామిని ఆరాధించడం వలన మంచి జరుగుతుంది. రామ రక్షా స్తోత్రాన్ని చదివితే ఆర్థిక సమస్యలు ఉండవు. “ఓం హం హనుమతే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి.
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజిస్తే మంచిదే. “ఓం మహాలక్ష్మి నమో నమః” అనే మంత్రాన్ని చదవడం వలన సమస్యలు తీరే, సంతోషంగా ఉండవచ్చు.
మిధున రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు వినాయకుడికి సంబంధించిన ఏ మంత్రానైనా 108 సార్లు పఠిస్తే మంచిది. “ఓం గం గణపతయే నమః” మంత్రాన్ని కూడా చదవవచ్చు.
మంత్ర జపన విధానం
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు సంతోషంగా ఉండాలని, సమస్యలు తీరాలంటే శివ పురాణాన్ని రోజూ చదవడం మంచిది. “ఓం నమః శివాయ” మంత్రాన్ని పఠిస్తే కూడా మంచి జరుగుతుంది.
సింహ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మంచిదే. గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సింహ రాశి వారికి బాగుంటుంది.
కన్యా రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు కెరియర్‌లో, వ్యాపారంలో విజయాలను పొందాలంటే సంకట నాశక గణపతి స్తోత్రాన్ని చదవాలి. “ఓం గం గణపతయే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు చదవడం మంచిదే.
తులా రాశి వారు మహాలక్ష్మిని ఆరాధించడం మంచిది. శ్రీ సూక్తం, మహాలక్ష్మి మంత్రాలను చదవడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారు “ఓం హ్రీం నమః” అనే మంత్రాన్ని చదివితే మంచిది. నెలకోసారి సుందరకాండను చదవడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఎరుపు, నలుపు రంగులు అదృష్టాన్ని తీసుకువస్తాయి.
ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధిస్తే మంచిది. “ఓం శ్రీ విష్ణువే నమః”, “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాలను 108 సార్లు చదవడం వలన జీవితంలో సక్సెస్ వస్తుంది.
విజయాలు, సంతోషాలకు మార్గం
మకర రాశికి అధిపతి శని. ఈ రాశి వారు హనుమంతుడిని, శని భగవానుని ఆరాధిస్తే మంచిది. హనుమాన్ చాలీసా చదవడం వలన మంచి జరుగుతుంది.
కుంభ రాశికి అధిపతి కూడా శని. ఈ రాశి వారు శివుడిని పూజించాలి. “మహా మృత్యుంజయ మంత్రంను” 108 సార్లు చదవాలి. రుద్రాభిషేకాన్ని నెలకు ఒకసారి చేయడం వలన మంచి జరుగుతుంది.
మీన రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు రామ రక్షా స్తోత్రాన్ని చదవడం వలన మంచి ఫలితం ఉంటుంది. “ఓం గ్రమ్ గ్రీం గ్రోమ్ సహ గురవే నమః” అనే మంత్రాన్ని పఠించడం వలన సమస్యలన్నీ తొలగిపోతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ప్రతి ఒక్కరూ తమ రాశికి అనుగుణంగా మంత్రాలను జపించి, దేవతలను ఆరాధించడం ద్వారా జీవితంలో సంతోషం, విజయాలను పొందవచ్చు. శ్రద్ధ, నమ్మకంతో జపించడం ముఖ్యం.


