|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమలో మునిగిన ప్రతాప్: ఐ లవ్ యు అనబోయి టీజర్ రిలీజ్ చిక్కుల్లో పడ్డాడు!

Published: 23-03-2026, 1:35 PM
ప్రేమలో మునిగిన ప్రతాప్: ఐ లవ్ యు అనబోయి టీజర్ రిలీజ్ చిక్కుల్లో పడ్డాడు!
  • తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా ‘పాపం ప్రతాప్’ చిత్రం
  • చిత్రానికి S.P.దుర్గా నరేష్ దర్శకత్వం
  • ఫన్నీ ప్రోమోలో ఐ లవ్ యు చెప్పబోయి టీజర్ అప్‌డేట్ ఇచ్చిన హీరో
  • మంగళవారం ‘పాపం ప్రతాప్’ టీజర్ విడుదల

యంగ్ హీరో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పాపం ప్రతాప్’. ఈ సినిమా టీజర్ విడుదల కాబోతోంది. విడుదలకి ముందు చిత్ర యూనిట్ ఒక ఫన్నీ ప్రోమోను విడుదల చేసింది. ఆ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

‘పాపం ప్రతాప్’ మూవీ విశేషాలు

Papam Prathap: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ (The Great Pre Wedding Show) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ (Thiruveer).. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అందులో తిరువీర్ హీరోగా S.P.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పాపం ప్రతాప్’ (Papam Prathap). పాయల్ రాధాకృష్ణ (Payal Radhakrishna) హీరోయిన్‌గా నటిస్తోంది. కృషి ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గ‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యూనిక్ ప్రమోషన్స్‌తో ఆసక్తిని క్రియేట్ చేయగా, ఇంకా ఇంకా ప్రమోషనల్ కంటెంట్‌ని మేకర్స్ వదులుతూనే ఉన్నారు. తాజాగా హీరో, హీరోయిన్ ఇద్దరూ నీకో విషయం చెప్పాలి.. నువ్వు ఫస్ట్ అంటే నువ్వు ఫస్ట్ అని పోటీ పడుతున్న వీడియో ఒకటి మేకర్స్ వదిలారు. ఈ ఫన్నీ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అసలిందులో ఉన్న విషయం ఏమిటంటే..

వైరల్ అవుతున్న ఫన్నీ ప్రోమో

హీరోయిన్ ఒంటరిగా నిలబడి ఉంటే, హీరో వచ్చి హాయ్ అని పరిచయం చేసుకుంటాడు. ఇద్దరి హాయ్ అని చెప్పుకున్న తర్వాత ముందుగా హీరో ‘నీకో విషయం చెప్పాలి’ అని అంటే, ‘నేను కూడా నీకో విషయం చెప్పాలి’ అని హీరోయిన్ అంది. ‘నిజంగానా.. ఏంటి?’ అని హీరో అంటే.. ‘నువ్వు చెప్పు’ అని హీరోయిన్.. కాదు నువ్వు చెప్పు అంటే నువ్వు చెప్పు అనుకుంటూ.. ‘లేడీస్ ఫస్ట్ ముందు నువ్వు చెప్పు’ అని హీరో అనగానే.. కాదు నువ్వు చెప్పు అని హీరోయిన్ అంటుంది. ఇక హీరో ఈ వాదనను మరింత పెంచడం ఇష్టం లేక.. ‘‘నువ్వూ చెప్పొద్దు.. నేనూ చెప్పను. నేను వన్, టు, త్రీ అంటా. ఇద్దరం కలిసి ఒకేసారి చెబుదాం’’ అని అనగానే హీరోయిన్ ఒకే అంటుంది. కౌంట్ తర్వాత ఎంతో ఆశగా హీరో ‘ఐ లవ్ యు’ అని చెబితే.. హీరోయిన్ మాత్రం ఇంకోటి చెప్పింది. ఏంటది అనుకుంటున్నారా?

టీజర్ విడుదల ఎప్పుడంటే?

‘పాపం ప్రతాప్ టీజర్ రిలీజింగ్ టుమారో’ అని హీరోయిన్ అనగానే హీరో ఫేస్ చూడాలి.. అబ్బో చెబితే సరిపోదు.. చూడాల్సిందే. వెంటనే హీరోయిన్.. నువ్వేం చెప్పావ్ అనగానే.. ‘అదే పాపం ప్రతాప్ టీజర్ గురించే’ అంటూ కవర్ చేసుకున్నాడు. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఇదే (Papam Prathap Teaser Update). ‘పాపం ప్రతాప్’ టీజర్ మంగళవారం విడుదల కాబోతోంది అని చెప్పడానికే ఇదంతా. ఇక ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 17న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. విడుదల కానుంది. అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి K.M రాధా కృష్ణ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు.

‘పాపం ప్రతాప్’ టీజర్ విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక శుభవార్త. ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని ప్రోమో ద్వారా తెలుస్తోంది. రేపు టీజర్ విడుదల కానుంది. చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.