
అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ముగ్గురు హీరోయిన్లు నటించిన ‘పరదా’ సినిమా రివ్యూ ఇది. పడతి గ్రామంలోని ఆచారాల నేపథ్యంలో సాగే ఈ సినిమా కథాంశం, నటన, దర్శకత్వం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Key Points
అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ముగ్గురు హీరోయిన్లు నటించిన సినిమా ఇది.
పడతి గ్రామంలోని వింత ఆచారం చుట్టూ తిరిగే కథ.
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 22న విడుదల కానుంది.
పరదా సినిమా కథాంశం
మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్న తెలుగు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ . హీరోయిన్‌గా సంగీత ఎంతోమంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మలయాళంలో దర్శన రాజేంద్రన్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కలిసి నటించిన తెలుగు సినిమా పరదా.
సినిమా బండి, శుభం సినిమాల డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా మూవీలో రాగ్ మయూర్, గౌతమ్ మీనన్, రాజేంద్ర ప్రసాద్, హర్ష వర్ధన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 22న థియేటర్లలో పరదా మూవీ రిలీజ్ కానుంది. కానీ, సినిమాపై నమ్మకంపై రెండు రోజుల ముందే మీడియాకు పరదా ప్రీమియర్ షోలు వేశారు మేకర్స్.
“రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి” అని అనుపమ పరమేశ్వరన్ ఓపెన్ కామెంట్స్ కూడా చేసింది. అనుపమ పరమేశ్వరన్ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్న ఈ సినిమా ఎలా ఉందో నేటి పరదా రివ్యూ లో తెలుసుకుందాం.
పడతి అనే ఓ గ్రామంలో వింత ఆచారం ఉంటుంది. అమ్మాయిలు ముఖానికి పరదా కప్పుకుని ఉండాలి. ఎవరైన పొరపాటున పరదా తీస్తే వారికి గ్రామ దేవత జ్వాలమ్మకు ఆహుతి అవ్వాలి. అయితే, అదే ఊరిలోని సుబ్బు (అనుపమ), రాజేష్ (రాగ్ మయూర్) ప్రేమించుకుంటారు. సుబ్బు, రాజేష్‌కు పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయిస్తారు. కానీ, అనుకోకుండా స్వప్న ఫొటో బయటపడుతుంది.
నటీనటుల ప్రదర్శన
స్వప్న పరదా తీసిందని, ఆత్మాహుతి చేసుకోవాలని పెద్దలు నిర్ణయిస్తారు. దాంతో స్వప్న ధర్మశాలకు వెళ్తుంది. స్వప్న వేళ్లే క్రమంలో రత్న (సంగీత), అమిష్ట (దర్శన రాజేంద్రన్) తోడుగా నిలుస్తారు. ఈ ముగ్గురి ప్రయాణం ఎటువైపు వెళ్లింది? అసలు పడతి గ్రామంలో అమ్మాయిలు ఎందుకు పరదా ధరించాలి?, సుబ్బు నిజంగా పరదా తీసిందా? అనేది తెలియాలంటే పరదా మూవీ చూడాల్సిందే.
అప్పుడప్పుడు మాత్రమే మహిళా ప్రాధాన్యత సినిమాలు వస్తుంటాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో వచ్చిన ఫీమేల్ సెంట్రిక్ మూవీనే పరదా. సినిమా బండి మూవీతో ఎంతో పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కండ్రేగుల నుంచి ఓ చిత్రం వస్తుందనగానే కాస్తా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అవలీలగా దాటేసాడు ప్రవీణ్ కండ్రేగుల.
పడతి గ్రామంలో అమ్మాయిలు ఎందుకు పరదా ధరిస్తారో చెప్పే కథతో ప్రారంభమయ్యే ఈ సినిమాను క్లైమాక్స్ వరకు మంచి ఎంటర్‌టైన్ చేసేలా తెరకెక్కించారు. ముఖానికి పరదా వేసుకునే కథ, సుబ్బు ప్రేమ, నిశ్చితార్థం, ధర్మశాలకు వెళ్లే కథనం బాగుంది.
పరదా తీస్తే ఆత్మాహుతి చేసుకోవడం అనే కఠినమైన నిబంధనను మహిళలపై ఇదివరకు విధించిన మూఢ నమ్మకాలను బలంగా గుర్తుకు తెస్తుంది. ముగ్గురు డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలు కలిసి ప్రయాణం చేస్తే వచ్చే ఆలోచనలు, ఇబ్బందులు తదితర అంశాలను బాగా చూపించారు.
సినిమా ప్రత్యేకతలు
ఆచారం, సాంప్రదాయల కారణంగా మహిళలు ఎలా అణగారిపోయారో చెప్పే సినిమా ఇది. అలాగే, మూఢ నమ్మకాలు మహిళలను ఎంత వెనక్కి తీసుకెళ్తాయో చూపించే సినిమా ఇది. ఒకప్పటి మహిళ్లలో నేటి అమ్మాయిల్లో వచ్చిన చైతన్యం ఎలా ఉంది, వారు పరిస్థితులను ఎదుర్కొనే తీరు వంటి చాలా సామాజిక అంశాలను చక్కగా ప్రస్తావించారు.
పలు చోట్ల ఇప్పటికీ ఈ మూఢ నమ్మకాలు, ఆచారాలు మహిళలను ప్రపంచానికి దూరం చేస్తున్నాయి. అలాంటి వారికోసమే ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అమ్మాయిలు భయాన్ని వదిలేసి ధైర్యంగా బతకాలని చెప్పే స్ఫూర్తివంతమైన సినిమా ఇది. ముగ్గురు అమ్మాయిల పాత్రలను చాలా బాగా చూపించారు.
వారి పాత్రలతో నేటి మహిళల ఆలోచనలను ప్రతిబింబించారు. సీతాకోక చిలుక రెఫరెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా కన్విన్సింగ్‌గా ముగింపు ఇచ్చారు డైరెక్టర్. ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం హైలెట్ అవుతుంది. ఎడిటింగ్, సాంకేతిక నిర్మాణ విలువలు అన్ని బాగా కుదిరాయి.
ఇక ముగ్గురి హీరోయిన్ల యాక్టింగ్ సినిమాకు ప్రధాన బలం. ముగ్గురికి ముగ్గురు అదరగొట్టారు. అనుపమ పరమేశ్వరన్, సంగీత పాత్రలకు న్యాయం చేశారు. కనిపించేది కొద్దిసేపు అయిన దర్శన రాజేంద్రన్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే, మెప్పించే పరదా చాటు కథ.
మొత్తం మీద, పరదా సినిమా మహిళా ప్రాధాన్యతను చూపించే ప్రయత్నం చేసింది. కథనం, నటన బాగున్నాయి. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.


