|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Paradha: అనుపమ ‘ప‌రదా’ నుంచి థీమ్ సాంగ్ విడుద‌ల.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్..

Published: 17-07-2025, 10:43 PM
Paradha: అనుపమ ‘ప‌రదా’ నుంచి థీమ్ సాంగ్ విడుద‌ల.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్..

అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ సినిమా నుంచి థీమ్ సాంగ్ విడుదలైంది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అనే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. గోపి సుందర్ సంగీత దర్శకత్వం వహించారు.

Key Points

1

అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘పరదా’ సినిమా థీమ్ సాంగ్ విడుదల.

2

‘యత్ర నార్యస్తు పూజ్యంతే’ అనే థీమ్ సాంగ్ లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

4

ఆగష్టు 22న ‘పరదా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘పరదా’ థీమ్ సాంగ్ విడుదల

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా ‘పరదా’(Paradha). దీనికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీధర్ మక్కువ, విజయ్ దొంకాడ ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో దర్శన రాజేంద్ర(Darshana Rajendran), టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత(Sangeetha) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 22న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ థీమ్ ఆఫ్ ప‌రదా సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా.. అనురాగ్ కుల‌క‌ర్ణి పాడాడు. గోపి సుంద‌ర్ సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌లోని లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. కాగా సంప్రదాయపు కట్టుబాట్లు మ‌హిళ‌ల‌ను ఎలా అణ‌చివేస్తున్నాయి. ఎలా ఎద‌గ‌కుండా అణగదొక్కుతున్నాయి.. వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే సోషియో డ్రామా క‌థాంశంతో ఈ సినిమా రాబోతుంది.

గూస్‌బంప్స్ తెప్పించే లిరిక్స్

ఆగష్టు 22న సినిమా విడుదల

మహిళల అణచివేతను, వారి ఎదుగుదలను చూపించే ‘పరదా’ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. థీమ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.