|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: చరణ్ vs నాని.. ‘ప్యారడైజ్’ రేస్ నుండి అవుట్! నిర్మాత సంచలన ప్రకటన!

Published: 19-01-2026, 5:00 AM
షాకింగ్: చరణ్ vs నాని.. 'ప్యారడైజ్' రేస్ నుండి అవుట్! నిర్మాత సంచలన ప్రకటన!
  • నాని ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు, రిలీజ్ డేట్ వాయిదా!
  • రామ్ చరణ్ సినిమాతో పోటీ పడే ఆలోచన లేదని తెలిపిన నిర్మాత సుధాకర్ చెరుకూరి.
  • సినిమా 60% షూటింగ్ పూర్తి, త్వరలో పాటల చిత్రీకరణ ప్రారంభం కానుంది.
  • టీజర్ లోని భూతులు మదర్ ఎమోషన్ కి కనెక్ట్ అవుతాయని నిర్మాత వెల్లడి.

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ చిత్రం గురించి ఒక సంచలన వార్త! ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ తో పోటీ ఉంటుందా లేదా అనే దానిపై ఆయన ఏం చెప్పారో చూద్దాం!

చరణ్ తో పోటీ లేనట్టేనా?

Paradise : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా మార్చ్ 26 రిలీజ్ చేస్తారని ప్రకటించారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది సినిమా కూడా రిలీజ్ కి ఉంది. మరి ఈ రెండు సినిమాలు పోటీ పడతాయా అనే చర్చ ఇన్ని రోజులు జరుగుతూ ఉంది.(Paradise)

తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి మీడియాతో మాట్లాడుతూ నాని ప్యారడైజ్ సినిమాపై అప్డేట్ ఇచ్చారు.

సమ్మర్ రిలీజ్ ప్లాన్స్ ఉన్నాయా?

సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ.. రామ్ చరణ్, నాని రెండు సినిమాలు ఒకేసారి రావు. సమ్మర్లో పెద్ద సినిమాలు ఎక్కువ లేవు. కాబట్టి వాయిదా పడొచ్చు. మేము పోటీకి రాము. సమ్మర్ లో ఎప్పుడు వచ్చినా పర్లేదు. సినిమా అంతా సెట్స్ లోనే ఎక్కువ షూటింగ్ జరుగుతుంది. లైవ్ లొకేషన్స్ లేవు. ఎన్టీఆర్ సీఎం అయినప్పటి కాలంలో ముగిసే కథ ఇది. 1980 సమయంలో కథ. 60 శాతం షూటింగ్ అయింది. పాటలు, ఇంకొంత టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది. మార్చ్ వరకు పూర్తి చేయడానికి ట్రై చేస్తాము. అవ్వకపోయినా కంగారు లేదు. డైరెక్టర్ కి రిలీజ్ డేట్ ప్రెజర్ లేకుండానే తీయమని చెప్పాను. ప్రస్తుతం రాత్రి పూట వర్షం సీక్వెన్ సీన్స్ షూటింగ్ జరుగుతుంది.

భూతులపై నిర్మాత ఏమన్నారంటే?

నాకు ఇండస్ట్రీ హిట్ కావాలి, అలాంటి సినిమా తీయాలని ఉంది. అది ప్యారడైజ్ తో నెరవేరుతుంది. టీజర్ చూసి భూతుల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ సినిమా చూస్తే అంత వైలెంట్ అనిపించదు. ఆ భూతులు మదర్ ఎమోషన్ కి బాగానే కనెక్ట్ అవుతుంది అని తెలిపారు. దీంతో ప్యారడైజ్ సినిమా చెప్పిన డేట్ కి రాదని నిర్మాతలే క్లారిటీ ఇచ్చేసారు.

‘ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీపై నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.