
📌 Key Points
- పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ప్రేమలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా? స్వయంగా వెల్లడించిన అన్నా లెజినోవా!
- తీన్మార్ సినిమా సెట్స్‌లో మొదలైన పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పవన్, అన్నా!
- అత్తమ్మ చేతి మసాలా చికెన్ అంటే పవన్ కళ్యాణ్కి ఎంతో ఇష్టం.. స్వయంగా వెల్లడించిన అన్నా లెజినోవా!
- గత 15 ఏళ్లుగా అన్నా, పవన్ బంధం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతోంది.. కొణిదెల కుటుంబంలో కలిసిపోయిన అన్నా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా ప్రేమ కథ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది! వీరిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా? ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది!
అన్నా లెజినోవా ఏం చెప్పారంటే?
పవన్ కళ్యాణ్ భార్యగా అన్నాలెజినోవాకు మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఇలా ఖాతా తెరిచిందో లేదో లక్షల మంది ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మెగా అభిమానులే కాదు జనసేన కార్యకర్తలు కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేసింది. ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ అని ఆమె అడగ్గానే అభిమానులు ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది అన్నా లెజినోవా.
తీన్మార్ సెట్స్ లో మొదలైన ప్రేమాయణం!
పవన్ కళ్యాణ్‌ని పెళ్లి చేసుకున్నాక ఎన్నో తెలుగు వంటలు నేర్చుకున్నట్టు చెప్పింది అన్నాలెజినోవా. ఒక ఫాలోవర్ మీరు వంట చేయగలరా అని ప్రశ్నిస్తే… ‘మా అత్తమ్మ దగ్గర నేను వంటలు నేర్చుకున్నాను. బిర్యాని, రొయ్యల ఇగురు, పాలక్ పనీర్, చేపల పులుసు, పప్పు, గోంగూర చట్నీ, దోశ, ఇడ్లీ’ ఇలా ఎన్నో వంటకాలు చేయడం వచ్చని చెప్పింది అన్నా. మరొక అభిమాని పవన్ కళ్యాణ్కి ఇష్టమైన ఆహారం ఏమిటని ప్రశ్నించా.రు దానికి అన్నా ‘మా అత్తమ్మ చేసే మసాలా చికెన్ కర్రీ అంటే పవన్ కు చాలా ఇష్టం. నేను కూడా ఆ వంటను నేర్చుకున్నాను. అలాగే వదినమ్మ సురేఖ చేసే చేపల పులుసును కూడా పవన్ చాలా ఇష్టంగా తింటారు’ అని చెప్పింది.
పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా?
మరొక ఫాలోవర్ అందరికన్నా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది ఎవరు వదినా? అని ప్రశ్నించారు. దానికి అన్నా లెజినోవా ‘మీ అన్నయ్యే’ అని చెప్పింది. అంటే పవన్ కళ్యాణ్ అన్నాకు ప్రేమ, పెళ్లి ప్రపోజల్ చేసినట్లు దీని ద్వారా తెలుస్తోంది. వీరిద్దరూ తీన్మార్ సినిమా షూటింగ్లో కలిశారు. తీన్మార్ లో అన్నా లెజినోవా పాత్ర ఏమీ లేదు. కేవలం ఒక పబ్ లో ఇలా కనిపించి అలా మాయం అయిపోతుంది. కానీ ఆ సీన్లోనే పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారి చివరకు పెళ్లి వరకు దారి తీసింది. సినిమా సెట్స్‌లో మొదలైన పరిచయం ఇప్పుడు ఇద్దరు పిల్లలతో గాఢమైన బంధంగా మారిపోయింది. వీరిద్దరూ 2013లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ జీవితంలో ఇది మూడో వివాహం. గత 15 ఏళ్లుగా వీరిద్దరి బంధం స్థిరంగా సాగుతూ వస్తోంది. అన్నా కూడా కొణిదెల కుటుంబంలో బాగానే కలిసిపోయింది. భారతీయ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తుంది.
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా లవ్ స్టోరీ నిజంగా ఎంతో ఆసక్తికరంగా ఉంది కదూ! వారి బంధం ఇలాగే కలకాలం నిలవాలని కోరుకుందాం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


