
📌 Key Points
- రవితేజ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫ్లాప్!
- ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసిన హరీష్ శంకర్.. ఆయన రియాక్షన్ వైరల్.
- ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ‘తేరి’కి రీమేక్ కాదని స్పష్టం చేసిన హరీష్ శంకర్.
- మార్చి 19న విడుదల కానున్న ఉస్తాద్ భగత్ సింగ్.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం!
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఫ్లాప్ అవ్వడం, దానిపై పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అప్డేట్స్ తో మరింత హీట్ పెంచేసాడు హరీష్.
మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ పై పవన్ కళ్యాణ్ రియాక్షన్
టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కొంతకాలం క్రితం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ హిందీ సినిమా అయిన ‘రైడ్’కి అధికారిక రీమేక్గా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. తాజాగా హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదన్న హరీష్
ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడడంతో హరీష్ శంకర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమా గురించి మరియు మరికొన్ని విషయాల గురించి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాని గురించి తెలియజేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ… మిస్టర్ బచ్చన్ సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలిశాను. కలిశాక ఆయనతో సార్ నేను తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయ్యింది అని చెప్పాను.
గబ్బర్ సింగ్ లాగే ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అవుతుందా?
దానితో ఆయన పుట్టడంతోనే హిట్లతో పుట్టావా? ఓవర్ నైట్లో నీకు సక్సెస్ వచ్చిందా? పోయి నీ పని నువ్వు చూసుకో అన్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మొదటి నుండి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం తమిళ మూవీ ‘తేరి’కి రీమేక్ అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా హరీష్ శంకర్ ఈ సినిమా ఏ మూవీకి రీమేక్ కాదు, కొత్త కథతో తెరకెక్కింది అని తెలియజేశాడు. దానితో ఒక్కసారిగా ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఇప్పటికే పవన్, హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్రం కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందని పవన్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదల కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


