|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ మాస్ అనౌన్స్‌మెంట్: కరాటే టు సమురాయ్.. ఓజీ సీక్వెల్ ఫిక్స్!

Published: 07-01-2026, 7:45 AM
పవన్ కళ్యాణ్ మాస్ అనౌన్స్‌మెంట్: కరాటే టు సమురాయ్.. ఓజీ సీక్వెల్ ఫిక్స్!
  • పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి భారీ ప్రకటనకు సన్నద్ధం.
  • “కరాటే యోధుడు టు సమురాయ్” వీడియోతో ఓజీ లింక్ స్పష్టం.
  • కటానా కత్తితో కనిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే అంచనాలు.
  • ఓజీ చిత్రంలో సమురాయ్ ప్రస్తావన, సీక్వెల్ ఊహాగానాలకు బలం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక మాస్ అప్డేట్ సిద్ధంగా ఉంది! ఆయన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి వచ్చిన ‘కరాటే టు సమురాయ్’ వీడియో టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓజీ సీక్వెల్ పై బలమైన హింట్స్ ఇస్తూ, అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి అదిరిపోయే ట్వీట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. హరి హర వీరమల్లు చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ సెప్టెంబర్ లో రిలీజ్ అయిన ఓజీ మాత్రం సంచలన విజయం సాధించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది.

మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక చిత్రంలో నటించాల్సి ఉంది. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో ప్రారంభించిన తన ప్రొడక్షన్ హౌస్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని తిరిగి యాక్టివ్ చేశారు.

మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ తో ప్రస్తుతం అభిమానుల ని ఊరిస్తున్నారు. తాజాగా ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలో భారీ ప్రకటన రాబోతోంది అంటూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఒక వీడియో రిలీజ్ చేశారు.

కరాటే టు సమురాయ్: ఓజీ సీక్వెల్ పక్కానా?

ఈ వీడియోలో కరాటే యోధుడు టు సమురాయ్ అని రాసి ఉంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి  కటానా కత్తిని ఉపయోగిస్తున్నారు. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ నే అని అభిమానులు భావిస్తున్నారు. జాపనీస్ భాషలో కూడా కొన్ని పదాలు కనిపిస్తున్నాయి. సమురాయ్ ల గురించి ప్రస్తావన ఓజీ చిత్రంలో ఉంది.

ఈ వీడియోలో కరాటే యోధుడు టు సమురాయ్ అని ఉండడంతో ఇది ఓజీ 2 కి సంబంధించిన ప్రకటన గురించే అని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే ఓజీ 2 ఉండబోతోందా అనే అంచనాలు అభిమానుల లో పెరుగుతున్నాయి.

అభిమానుల్లో పెరిగిన ఉత్కంఠ!

Get Ready to witness Something Huge !! #PawanKalyanCreativeWorks https://t.co/bqwTQhzDJI

— Pawan Kalyan Creative Works (@PKCWoffl) January 7, 2026

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి రాబోయే ఈ భారీ ప్రకటన కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ కెరీర్‌లో ఇది ఒక సంచలనాత్మక మలుపు కావడం ఖాయం. మరింత సమాచారం కోసం వేచి ఉండండి, ఈ ఉత్కంఠకు ముగింపు లేదు!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.