|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమా? హరీష్ శంకర్ సంచలన ప్రకటన!

Published: 24-02-2026, 2:05 AM
పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరమా? హరీష్ శంకర్ సంచలన ప్రకటన!
  • గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.
  • సినిమాలో రాజకీయాలను టార్గెట్ చేయకూడదని పవన్ కళ్యాణ్ చెప్పారని హరీష్ శంకర్ తెలిపారు.
  • ప్రకాష్ రాజ్ తో కలిసి నటిస్తున్న పవన్ ప్రొఫెషనలిజం అద్భుతం అని హరీష్ కొనియాడారు.
  • సినిమాలో ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం లేదని, వినోదం పంచడమే లక్ష్యమని హరీష్ శంకర్ స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై వస్తున్న విమర్శలపై హరీష్ శంకర్ స్పందించారు. సినిమాలో రాజకీయాలకు తావు లేదని, కేవలం వినోదం కోసమేనని ఆయన స్పష్టం చేశారు.

ఉస్తాద్ భగత్ సింగ్ వివాదాలు

Harish Shankar:ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’ . ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. అలా మళ్లీ ఈ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన మొదటిపాట ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఇటీవల విడుదల చేసిన రెండవ పాట “ఆరా ఆఫ్ ఉస్తాద్” ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.

వివరాలలోకి వెళ్తే.. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి విడుదల చేసిన రెండవ పాట ఆరా ఆఫ్ ఉస్తాద్ లో డైలాగులు ప్రత్యర్థి రాజకీయ పార్టీలను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అయితే విమర్శలకు తావు ఇవ్వకుండా తాజాగా ఈ వార్తలను దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. “సినిమా వేరు.. రాజకీయం వేరు.. అనే సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతున్నారు. షూటింగ్ ప్రారంభంలోనే పవన్ నాకు ఒక స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సినిమాలో రాజకీయాల జోలికి వెళ్లొద్దు.. ఏ వ్యక్తిని లేదా ఏ పార్టీని అసలు టార్గెట్ చేయకూడదని పవన్ నాతో స్వయంగా చెప్పారు” అని హరీష్ స్పష్టం చేశారు.

కేవలం వినోదం పంచడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం అని హరీష్ శంకర్ తెలిపారు.. ఇదిలా ఉండగా మరొకవైపు రాజకీయంగా విభిన్న ధ్రువాలు ఉన్నప్పటికీ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తో కలిసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు..ఇక ఈ విషయంపై కూడా హరీష్ శంకర్ స్పందిస్తూ.. రాజకీయ విభేదాలు ఉన్నా.. నటన విషయంలో పవన్ కళ్యాణ్ ప్రొఫెషనలిజం అద్భుతం. ఆయన వ్యక్తిగత భావజాలాన్ని సినిమా సెట్స్ లోకి తీసుకురారు” అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో ఎవరిని తక్కువ చేసే ఉద్దేశం లేదని కేవలం ప్రేక్షకులకు ఒక మంచి వినోదాన్ని పంచడమే తమ ఉద్దేశమని.. ఇక ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ డైలాగ్ లు రాశామని హరీష్ శంకర్ తెలిపారు. ఇక హరీష్ శంకర్ కామెంట్లతో సోషల్ మీడియాలో వస్తున్న పొలిటికల్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. మరి వీరు చెప్పినట్టుగానే.. పొలిటికల్ జోలికి వెళ్లకుండా కేవలం వినోదాన్ని మాత్రమే పంచే దిశగా అడుగులు వేసారేమో తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.

రాజకీయాలకు దూరం: హరీష్ శంకర్

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల విషయానికొస్తే.. ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఎప్పటినుంచో ఈ కాంబినేషన్లో సినిమా తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ. పలు కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.అలా ఇప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సినిమా చేయబోతున్నారు. అలాగే హరిహర వీరమల్లు సీక్వెల్ లో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్నారు.

ప్రకాష్ రాజ్ తో పవన్ కళ్యాణ్

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌ #UstaadBhagatSingh #Pawankalyan #Tollywood #directorharishshankar #BIGTVCinema @PawanKalyan @harish2you @UBSTheFilm @MythriOfficial pic.twitter.com/dYAqEVUpqC

— BIG TV Cinema (@BigtvCinema) February 23, 2026

హరీష్ శంకర్ ప్రకటనతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై వస్తున్న రాజకీయపరమైన వార్తలకు తెరపడింది. సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇది ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుందో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.