
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా మంది కమెడియన్లతో కలిసి నటించారు. కానీ, ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న కమెడియన్ ఎవరో తెలుసుకుందాం. అది బ్రహ్మానందం లేదా అలీ కాదు!
Key Points
పవన్ కళ్యాణ్ గారికి సుమన్ శెట్టి కామెడీ చాలా ఇష్టం.
సుమన్ శెట్టి 'జయం' సినిమాతో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ 'అన్నవరం', 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాల్లో సుమన్ శెట్టిని నటింపజేశారు.
సుమన్ శెట్టి పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించారు.
సుమన్ శెట్టి: పవన్ కళ్యాణ్ కి ఫేవరెట్ కమెడియన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చాలా మంది కమెడియన్లతో కలసి నటించారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, సునీల్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్ లాంటి కమెడియన్లతో పవన్ నటించిన సినిమాలు ఉన్నాయి. కానీ ఓ కమెడియన్ అంటే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానం ఉందట. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన కమెడియన్ అంటే బ్రహ్మానందం, అలీ లాంటి టాప్ కమెడియన్లు అనుకుంటే పొరపాటే. ఆ కమెడియన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం.
డైరెక్టర్ తేజ టాలీవుడ్ లో చాలా మంది నటీనటుల్ని పరిచయం చేశారు. తేజ పరిచయం చేసిన కమెడియన్లలో సుమన్ శెట్టి ఒకరు. జయం చిత్రంతో సుమన్ శెట్టి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుమన్ శెట్టి ఉండే వైవిధ్యమైన వాయిస్ అతడికి బలం. జయం తర్వాత చాలా చిత్రాల్లో సుమన్ శెట్టికి కమెడియన్ గా ఛాన్స్ వచ్చింది. సుమన్ శెట్టి కామెడీ అంటే పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టం అట. జయం మూవీ నుంచి సుమన్ శెట్టి నటించిన చిత్రాలని పవన్ చూస్తున్నారట. ఓ ఇంటర్వ్యూలో సుమన్ శెట్టి మాట్లాడుతూ.. జయం మూవీ నుంచి తన కామెడీ ని ఎంజాయ్ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు అని అన్నారు.
జయం సినిమా నుండి సుమన్ శెట్టి ప్రయాణం
అంత పెద్ద స్టార్ హీరోకి నా కామెడీ నచ్చడం చాలా అదృష్టం అని సుమన్ శెట్టి తెలిపారు. టాలీవుడ్ లో నేను ఇష్టపడే హీరోలు ముగ్గురు ఉన్నారు. పవన్ కళ్యాణ్, వెంకటేష్, మహేష్ బాబు అంటే తనకి చాలా ఇష్టం అని సుమన్ శెట్టి పేర్కొన్నారు. ఈ ముగ్గురితో తాను సినిమాలు చేశానని సుమన్ శెట్టి పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ గారితో అన్నవరం సినిమాలో నటించాను. అన్నవరం మూవీ షూటింగ్ కి తొలి రోజు వెళ్ళినప్పుడు.. పవన్ కళ్యాణ్ గారు నన్ను చూసి.. హాయ్ సుమన్.. నువ్వంటే నాకు ఇష్టం, నేను నీ ఫ్యాన్ ని.. నీ కళ్ళు బావుంటాయి.. నీ సినిమాలు నేను చూస్తుంటాను అని అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నన్ను గుర్తు పెట్టుకుని మరీ సర్దార్ గబ్బర్ సింగ్ లో అవకాశం ఇచ్చారు అని సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు. బరువు తగ్గేందుకు పవన్ కళ్యాణ్ గారు నాకు విలువైన సలహాలు కూడా ఇచ్చారు. మార్కింగ్ హాట్ వాటర్, లెమెన్ వాటర్ తాగమని చెప్పినట్లు సుమన్ శెట్టి గుర్తు చేసుకున్నారు.
పవన్ కళ్యాణ్ మరియు సుమన్ శెట్టి మధ్య అనుబంధం
సుమన్ శెట్టి తన కెరీర్ లో జయం, నిజం, అన్నవరం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఎందుకంటే ప్రేమంట లాంటి చిత్రాల్లో నటించారు. అదే విధంగా 7జి బృందావన కాలనీ చిత్రంలో కూడా సుమన్ శెట్టి నటించారు. ఆ మూవీలో సుమన్ శెట్టి కామెడీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం సుమన్ శెట్టి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సందడి చేస్తున్నారు.
సుమన్ శెట్టి కామెడీ పవన్ కళ్యాణ్ గారికి ఎంతో నచ్చిందని, వారిద్దరి మధ్య ఉన్న మంచి అనుబంధాన్ని ఈ కథనం చూపిస్తుంది. ‘అన్నవరం’ సినిమాతో మొదలైన వారి సంబంధం ఇప్పటికీ కొనసాగుతోంది.


