
📌 Key Points
- రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన సందర్భంగా మెగా ఇంట సంబరాలు.
- మనవడు, మనవరాలి పేరు మీద పవన్ కళ్యాణ్ భారీ ప్రకృతి వనాన్ని నిర్మించాలని నిర్ణయం.
- చిన్నతనంలోనే పిల్లలకు ప్రకృతితో అనుబంధం పెంచాలనే పవన్ కళ్యాణ్ సంకల్పం.
- అరుదైన పురాతన వస్తువులు, వెండి విగ్రహాలను కూడా కానుకగా అందించనున్న పవన్ కళ్యాణ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన దంపతుల కవల పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేస్తున్నారు. ఆ చిన్నారుల పేరు మీద ఒక భారీ ప్రకృతి వనాన్ని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మెగా కుటుంబంలో కవలల సందడి
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు రాజకీయాలలో.. మరొకవైపు తన సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో కూడా కుటుంబానికి ఆయన సమయాన్ని కేటాయిస్తారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల మెగా కుటుంబంలోకి ట్విన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన (Upasana) దంపతులకు ఇదివరకే ఒక అమ్మాయి జన్మించగా.. ఇప్పుడు కవలలు జన్మించారు. ఒక బాబు, పాప జన్మించారనే వార్తతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. అటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన మనవడు, మనవరాలి కోసం ఊహించని కానుకను ఇచ్చినట్లు ఫిలింనగర్ వార్తల్లో గట్టిగా వినిపిస్తోంది.విషయంలోకి వెళ్తే గతంలో క్లీంకారా(Klinkara) పుట్టినప్పుడు వెండి ఊయల, మొక్కలను పవన్ కళ్యాణ్ బహుమతిగా ఇచ్చిన విషయం విధితమే. అయితే ఇప్పుడు ఈ కవల పిల్లల కోసం ఆయన ప్రత్యేకమైన గిఫ్ట్ను సిద్ధం చేశారట. పవన్ కళ్యాణ్ తన మనవడు , మనవరాలి పేరు మీద ఒక భారీ ప్రకృతి వనాన్ని నిర్మించి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్ ప్లాన్
నిజానికి పవన్ కళ్యాణ్ కు ప్రకృతి, వ్యవసాయం అంటే ఎంత మక్కువ అందరికీ తెలిసిందే. కాస్త విరామం దొరికితే చాలు తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. అంతేకాదు తన ఫామ్ హౌస్ లో పండే మామిడి పళ్ళను కూడా పలువురు సెలబ్రిటీలకు పంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ చిన్నారుల పేర్లతో కొన్ని ఎకరాల భూమిలో అరుదైన వృక్షాలు, పండ్ల తోటలతో కూడిన ఒక ఫామ్ హౌస్ ను అభివృద్ధి చేసి.. చిన్నతనంలోనే ప్రకృతితో అనుబంధాన్ని వారికి పెంచాలనే కోరికతో ఇలా వారికి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వనున్నారట పవన్ కళ్యాణ్.
ప్రకృతితో అనుబంధం పెంచే ఆలోచన
మొత్తానికైతే ఇది ఆస్తి మాత్రమే కాదు రాబోయే తరానికి పర్యావరణం పై బాధ్యతను గుర్తు చేసే ఒక గొప్ప సంకల్పం అంటూ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొకవైపు అరుదైన పురాతన వస్తువులను, ఆధ్యాత్మిక సంబంధం కలిగి ఉన్న వెండి విగ్రహాలను కూడా ఆయన కానుకగా అందించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఒకవైపు బిజీగా ఉంటూనే.. మరొకవైపు తన అన్నయ్య కొడుకు పిల్లల కోసం సమయం కేటాయించి, వారిని చూడడానికి వెళ్లడంతో మెగా అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు . మరొకవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మొత్తానికి పవన్ కళ్యాణ్ తన మనవడు, మనవరాలికి అందించబోయే ఈ గిఫ్ట్ వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తుగా నిలిచిపోతుంది. పర్యావరణంపై బాధ్యతను గుర్తు చేసే గొప్ప సంకల్పం ఇది.


