
📌 Key Points
- ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు పవన్ కల్యాణ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్.
- పవన్ కల్యాణ్ ప్రేమ, ప్రోత్సాహం వర్ణనాతీతమని సుజీత్ ఎమోషనల్ పోస్ట్.
- ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్లు వసూలు చేసి, నెట్‌ఫ్లిక్స్‌లోనూ దుమ్ము రేపింది.
- పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి.
ఓజీ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజీత్‌కు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌పై సుజీత్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ బహుమతి, ఓజీ సినిమా విజయానికి నిదర్శనం.
పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ గిఫ్ట్!
ఓజీ మూవీ డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్. తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ అందించిన డైరెక్టర్ కు పవన్ ఇలా థ్యాంక్స్ చెప్పాడు. ఆ ఫొటోలను సుజీత్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
పవన్ కల్యాణ్ కెరీర్లోనే అతిపెద్ద ఓజీ రూపంలో వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఏడాది రిలీజైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోనూ దుమ్ము రేపింది. దీంతో తనకు ఇంత పెద్ద సక్సెస్ అందించిన డైరెక్టర్ సుజీత్ కు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్ కల్యాణ్.
సుజీత్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ గిఫ్ట్
“జీవితంలో బెస్ట గిఫ్ట్ ఇది. మాటలకు అందని కృతజ్ఞతా భావంతో నిండిపోయాను. మా డియరెస్ట్ ఓజీ పవన్ కల్యాణ్ గారి నుంచి అందిన ప్రేమ, ప్రోత్సాహం వర్ణించలేనిది. చిన్నప్పుడు అభిమానిగా ఉన్నప్పటి నుంచీ ఇప్పుడీ ప్రత్యేక క్షణం వరకు.. ఎప్పటికీ రుణపడి ఉంటాను” అనే క్యాప్షన్ తో సుజీత్ పోస్ట్ చేశాడు.
ఓజీ భారీ విజయం – బాక్సాఫీస్ రికార్డులు
ఖరీదైన ల్యాండ్ రోవర్ డిఫెండర్
ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కల్యాణ్‌ను చూస్తారు. పవన్ కల్యాణ్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అంతా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. అంతకుమించి అన్నట్లుగా పవర్ స్టార్‌తో కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్‌లో డైలాగ్స్ కంటే యాక్షన్ సీన్స్ ఎక్కువ. ప్రతి సీన్ పవన్ కల్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ ఖరీదైన ల్యాండ్ రోవర్ గిఫ్ట్ ఓజీ సినిమా విజయాన్ని, వారి మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ బహుమతి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఇది ఒక సంతోషకరమైన వార్త.


