|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! ఆ దర్శకుడికి షాక్.. సినిమా ఆగిపోయినట్టేనా?

Published: 19-02-2026, 10:35 AM
పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! ఆ దర్శకుడికి షాక్.. సినిమా ఆగిపోయినట్టేనా?
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా స్క్రిప్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • వక్కంతం వంశీ కథను అందించగా, పవన్ కొన్ని మార్పులు సూచించారు.
  • మార్పులు చేసిన స్క్రిప్ట్ పవన్‌కు నచ్చకపోవడంతో తిరిగి రివైజ్ చేయాలని తెలిపారు.
  • స్క్రిప్ట్ నచ్చితే మే నెలలో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కాల్సిన సినిమా స్క్రిప్ట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సినిమా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ అసంతృప్తికి కారణం ఏమిటి?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఒక సినిమా విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లయితే తెగ వినిపిస్తోంది. అసలు విషయానికి వస్తే.. దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సిన సినిమా స్క్రిప్ట్‌పై పవన్ తాజాగా అసంతృప్తి వ్యక్తం చేశారంట.

కొంతకాలంగా పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఉగాది సందర్భంగా గ్రాండ్‌గా ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు కథను వక్కంతం వంశీ రాస్తున్నారు. మొదటిసారి కథ వినిపించినప్పుడు పవన్‌కు కథ బాగా నచ్చింది. అందుకే చాలా రోజుల క్రితమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే.. ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌ను సురేందర్ రెడ్డి.. రెండు సార్లు కలిసి స్క్రిప్ట్ వినిపించారంట. ఆ సమయంలో పవన్ కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించారంట. పవన్ చెప్పినట్లుగా దర్శకుడు.. రచయిత కలిసి కథను మార్చారు. కానీ తాజాగా మార్చిన వెర్షన్ పవన్‌కు నచ్చలేదట.

స్క్రిప్ట్‌లో పవన్ సూచించిన మార్పులు ఏమిటి?

కథలో ఇంకా బలమైన ఎమోషన్, కొత్తదనం కావాలని పవన్ భావిస్తున్నారట. అందుకే స్క్రిప్ట్‌ను మళ్లీ పూర్తిగా రివైస్ చేసి తిరిగి వినిపించాలని ఆయన స్పష్టంగా చెప్పారని సమాచారం. దీంతో సురేందర్ రెడ్డి టీమ్ మరోసారి కథపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ సినిమా క్యాన్సిల్ అయింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఆ వార్త మొత్తం కేవలం రూమర్ మాత్రమే అని..ఈ స్క్రిప్ట్ మళ్లీ పవన్ కి నచ్చినట్టు ఈ దర్శకుడు తీసుకొస్తే.. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభించడం ఖాయం అని సమాచారం.

స్క్రిప్ట్ వర్క్ కరెక్ట్ గా పూర్తయితే..ఈ సినిమా షూటింగ్‌ను మే నెలలో ప్రారంభించాలనే ఆలోచన ఉంది. మరోపక్క పవన్ పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే తన డేట్స్ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి సినిమా తప్ప ఇంకే కొత్త ప్రాజెక్ట్‌కు ఒప్పుకోలేదు.

సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ సినిమాను నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారని, అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి…పవన్ కళ్యాణ్ కోరుకున్న స్థాయిలో కథ సిద్ధమైతేనే ఈ సినిమా ముందుకు వెళ్లనుంది. అభిమానులు మాత్రం పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకుండా, తన స్థాయికి తగ్గట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. అభిమానులు మాత్రం పవన్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.