
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు 70-80 కోట్లు అని అంచనాలు. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్.
Key Points
హరి హర వీరమల్లు తొలిరోజు 70-80 కోట్ల వసూళ్లు
పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్
లాంగ్ రన్ లో సినిమా పనితీరు కీలకం
భారీ అంచనాల మధ్య విడుదల
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ నటించిన తొలి చిత్రం హరి హర వీరమల్లు . దీంతో హరి హర వీరమల్లుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతటి భారీ అంచనాల నడుమ ఇవాళ (జూలై 24) థియేటర్లలో హరి హర వీరమల్లు విడుదలైంది.
కానీ, ఆ అంచనాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టలేదని తెలుస్తోంది. హరి హర వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్ ఈ వారం ప్రారంభంలో ఆశాజనకంగా ప్రారంభమైంది. విడుదలకు కొన్ని గంటల ముందు ప్రారంభమైన ప్రీ-సేల్‌తో అంటే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇండియాలో రూ.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు దాటినట్లు సక్నిల్క్ తెలిపింది.
ఇండియాలో ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గ్రాస్ దాదాపు రూ.30 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.16 కోట్లకు పైగా వసూలు చేసింది. రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక ఇతిహాసానికి దాదాపు రూ.50 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్లు సమాచారం.
తొలిరోజు వసూళ్లు
ఇండియాలో హరి హర వీరమల్లు సినిమాకు తొలి రోజు రూ.40 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అలాగే, రూ.50 కోట్లకు కూడా చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే వకీల్ సాబ్ రూ. 40.50 కోట్ల మార్కును అధిగమించి పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా హరి హర వీరమల్లు నిలుస్తుంది.
ఇక ఓవర్సీస్‌లో 3 మిలియన్ డాలర్లు (రూ. 25 కోట్లు) రాబట్టిన ఈ చిత్రం తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 70-80 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. మరి పవన్ కల్యాణ్ రేంజ్, బడ్జెట్ బట్టి ఈ స్థాయి కలెక్షన్స్ సరిపోతాయా అనేది ప్రశ్నగా మారింది.
హరి హర వీరమల్లు డిస్ట్రిబ్యూషన్ హక్కులు రూ. 100 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని, అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే ప్రపంచవ్యాప్తంగా రూ. 225 కోట్లకుపైగా కలెక్షన్స్ రావాలని సక్నిల్క్ తెలిపింది.
లాంగ్ రన్ ప్రభావం
అయితే, ఓపెనింగ్స్ బాగానే వచ్చిన లాంగ్ రన్‌లో చతికిలపడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా రూ. 80 కోట్లు రాబట్టింది. కానీ, ఆ తర్వాత రూ. 186 కోట్లతోనే ముగించింది.
ఈ లెక్కన, ప్రస్తుతం మిక్స్‌డ్ రివ్యూ లు అందుకుంటున్న హరి హర వీరమల్లు లాంగ్ రన్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది కీలకంగా మారింది. మరో గేమ్ ఛెంజర్ లాగే హరి హర వీరమల్లు అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది.
హరి హర వీరమల్లు ఓపెనింగ్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ, లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటడం ముఖ్యం.


