|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఇండియా టాప్‌ 10 హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌, ఫ్యాన్స్ కాలర్‌ ఎగరేసే విషయం.. నెంబర్‌ 1 ఎవరంటే? లిస్ట్ ఇదే

Published: 20-08-2025, 11:44 PM
ఇండియా టాప్‌ 10 హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌, ఫ్యాన్స్ కాలర్‌ ఎగరేసే విషయం.. నెంబర్‌ 1 ఎవరంటే? లిస్ట్ ఇదే

తాజాగా విడుదలైన ఓర్మాక్స్ మీడియా ఇండియా టాప్ 10 హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ స్థానం సంపాదించడం ఆయన అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ఈ జాబితాలో ప్రభాస్, విజయ్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఎలాంటి స్థానాలను దక్కించుకున్నారో చూద్దాం.

Key Points

1

ఓర్మాక్స్ మీడియా జాబితాలో పవన్ కళ్యాణ్ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.

2

ప్రభాస్ ఇండియాలో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు.

4

హరి హర వీరమల్లు చిత్రం ప్రమోషన్స్ పవన్ కళ్యాణ్‌కు టాప్ 10లో స్థానం దక్కించిపెట్టింది.

ఓర్మాక్స్ మీడియా టాప్ 10 జాబితా

సినిమాకి సంబంధించిన సర్వేల్లో పవన్‌ కళ్యాణ్‌ చాలా వరకు ఉండరు. సినిమాల కలెక్షన్ల పరంగా, ఇండియా వైడ్‌ స్టార్‌డమ్‌ పరంగా పవన్‌ ది సెపరేట్‌ లెక్క. ఎవరి లెక్కలకు అందనివారు. తెలుగు స్టేట్స్ లో అందరు హీరోల కంటె ఎక్కువగా స్టార్‌డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా సినీ వర్గాలను సర్‌ప్రైజ్‌ చేశారు పవన్‌. ముఖ్యంగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా చేశారు. ఓర్మాక్స్ మీడియా జులై నెలకు సంబంధించిన ప్రకటించిన ఇండియా టాప్‌ 10 పాపులర్‌ హీరోస్‌ జాబితాలో స్థానం సంపాదించారు. మరి ఇందులో ఎవరి స్థానం ఏంటి? ఎవరెవరు స్థానం సంపాదించారనేది తెలుసుకుందాం.

జులై నెలకు సంబంధించి ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ మేల్‌ ఫిల్మ్ స్టార్స్ ఇండియా లిస్ట్ లో ఎప్పుడూ లేని విధంగా పవన్‌ కళ్యాణ్‌ స్థానం సంపాదించడం విశేషం. ఆయన టాప్‌ 10లో పదో స్థానంలో నిలిచారు. గత నెలలో పవన్‌ `హరి హర వీరమల్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఈ మూవీ కోసం ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. స్వయంగా చాలా ఇంటర్వ్యూలిచ్చారు. మీడియా ఇంటరాక్షన్‌ చేశారు. దీంతో నెల రోజుల పాటు ఆయనపై చర్చ జరిగింది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. దీంతో టాప్‌ 10లో చోటు సంపాదించారు. బేసిక్‌గా ఇలాంటి వాటికి ఆయన దూరం. వీటిని పట్టించుకోరు. గట్టిగా దృష్టి పెడితే ఇవి పెద్ద లెక్క కాదని నిరూపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌.

పవన్ కళ్యాణ్ యొక్క అనూహ్య విజయం

ఇక ఎప్పటిలాగే తన స్థానాన్న పదిలపర్చుకున్నారు  ప్రభాస్‌. ఆయన ఈ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో నెంబర్‌ వన్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. చాలా నెలలుగా ఈ స్థానంలో ఆయన ఉంటున్నారు. ఇప్పుడు మరోసారి మొదటి స్థానంలో నిలిచారు. ఇండియా వైడ్‌గా తనకు పోటీ లేదని నిరూపించుకుంటున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన `ది రాజాసాబ్`, `ఫౌజీ` చిత్రాలతో బిజీగా ఉన్నారు. `ది రాజాసాబ్‌` డిసెంబర్ 5న విడుదల కానుంది.

రెండో స్థానంలో తమిళ స్టార్‌ దళపతి విజయ్‌ నిలిచారు. ఆయన కూడా గత కొన్ని నెలలుగా రెండో స్థానంలో ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే ప్లేస్‌ని ఖాయం చేసుకున్నారు. తనకు కూడా పోటీ లేదని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు `జన నాయగన్‌` చిత్రంతో రాబోతున్నారు. మూడో స్థానం బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ దక్కించుకోగా, నాల్గో స్థానంలో అల్లు అర్జున్‌ నిలిచారు. `పుష్ప 2`తో బన్నీ రేంజ్‌ మారిపోయింది. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్‌ రేంజ్‌లో మూవీ చేస్తున్నారు. దీంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఆయన కూడా నాల్గో స్థానంలో నిలుస్తున్నారు.

ప్రభాస్, విజయ్, షారూఖ్ ఖాన్ స్థానాలు

ఐదో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ నిలిచారు. ఆయన కూడా తన స్థానాన్ని పదిలపర్చుకుంటున్నారు. ఇక ఆరో స్థానంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ నిలిచారు. ప్రస్తుతం మహేష్‌.. రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా చేస్తున్నారు. ప్రపంచసాహసికుడిగా ఇందులో మహేష్‌ కనిపించబోతున్నారు. ఇటీవల ప్రీ లుక్‌ విడుదలై ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన చర్చ రెగ్యూలర్‌గా జరుగుతోంది. దీంతో మహేష్‌ కూడా రెగ్యూలర్‌గా ఆరో స్థానంలో నిలుస్తున్నారు.

ఎన్టీఆర్‌ ఇటీవల `వార్‌ 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆయన నటించిన చిత్రమిది. ఆగస్ట్ 14న విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డీలా పడిపోయింది. ఈ క్రమంలో కొంత ట్రోల్స్, మరికొంత టీడీపీ నాయకుల వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు తారక్‌. దీంతో ఆయన ఏడో స్థానంలో నిలవడం విశేషం. ఇక ఆ తర్వాత స్థానం(8వ)లో రామ్‌ చరణ్‌ నిలిచారు. ఈ ఏడాది `గేమ్‌ ఛేంజర్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన రామ్‌ చరణ్‌ ఇప్పుడు `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. ఇక తొమ్మిదో స్థానంలో బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ నిలవడం విశేషం. పదో స్థానం పవన్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

చివరగా, ఈ జాబితా ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల ప్రజాదరణను తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ టాప్ 10లో చోటు సంపాదించడం ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.