
📌 Key Points
- జైలర్ 2లో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్.. తమిళ మీడియాలో హాట్ టాపిక్!
- రజినీకాంత్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేరింగ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్!
- షారుఖ్ ఖాన్ చేయాల్సిన పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారని సమాచారం.. ఇది నిజమైతే పండగే!
- పవన్ కళ్యాణ్ ఎంట్రీతో జైలర్ 2కి మరింత క్రేజ్.. మూవీ యూనిట్ ప్రకటన కోసం ఎదురుచూపులు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జైలర్ 2లో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్లో ఒక సంచలనం. రజినీకాంత్తో కలిసి పవన్ కళ్యాణ్ స్క్రీన్ పంచుకుంటే చూడాలనే అభిమానులకు ఇది నిజంగా ఒక పండుగలాంటి వార్తే.
జైలర్ 2లో పవన్ కళ్యాణ్.. వైరల్ న్యూస్!
Pawan Kalyan : రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ 500 కోట్లు కలెక్ట్ చేసి పెద్ద హిట్ అయింది ఈ సినిమా. మరోసారి రజినీకాంత్ జైలర్ సినిమాతో తన పవర్ చూపించారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి సినిమాని మరింత హైలేట్ చేసారు.
ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. దీంతో జైలర్ 2 పై కూడా అంచనాలు నెలకొన్నాయి. పార్ట్ 1లో ఉన్న మోహన్ లాల్, శివరాజ్ కుమార్ జైలర్ 2లో కూడా కనిపించబోతున్నారు. అంతేకాకుండా పార్ట్ 2లో షారుఖ్ ఖాన్, బాలకృష్ణ కూడా గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే షారుఖ్ వేరే సినిమా డేట్స్ వల్ల ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసారంట. బాలయ్యది కేవలం రూమర్ అని సమాచారం.
రజినీకాంత్, పవన్ కాంబో.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
తాజాగా జైలర్ 2 సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని తమిళ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే తమిళ సినిమా పీఆర్వోలు పలువురు ఈ వార్తని కంఫర్మ్ చేస్తూ జైలర్ 2 సినిమాలో షారుఖ్ చేయాల్సిన పాత్రని పవన్ కళ్యాణ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
షారుఖ్ ప్లేస్ లో పవన్.. నిజమెంత?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే అంటున్నారు. ఇది నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇటీవల పవన్ పాలిటిక్స్ వల్ల తమిళ్ లో కూడా ప్రచారాలు చేస్తూ అక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. దీంతో పవన్ ఎంట్రీ సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది. అయితే దీనిపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇది నిజం అవ్వాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి జైలర్ 2 లో రజినీకాంత్ పక్కన మన పవన్ కళ్యాణ్ కనిపిస్తారా లేదా చూడాలి.
పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ గురించి వస్తున్న ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


