|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ల్యాండ్ రోవర్.. ‘OG’ సుజిత్ ఆనందానికి హద్దుల్లేవ్!

Published: 16-12-2025, 3:44 AM
పవన్ కళ్యాణ్ ఇచ్చిన ల్యాండ్ రోవర్.. 'OG' సుజిత్ ఆనందానికి హద్దుల్లేవ్!
  • పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ డైరెక్టర్ సుజిత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు.
  • ‘ఓజీ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు ఈ ఖరీదైన గిఫ్ట్ అందించారు.
  • సుజిత్ పవన్ కళ్యాణ్ బహుమతిపై ఎమోషనల్ పోస్ట్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
  • పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన గొప్ప మనసును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా విజయానికి గుర్తుగా డైరెక్టర్ సుజిత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ ఊహించని బహుమతికి సుజిత్ ఎంతో ఆనందంతో, కృతజ్ఞతతో ఎమోషనల్ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్తపై ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సుజిత్ (Sujith)కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’(og). ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి తీర్చింది. ప్రేక్షకులు పవర్ స్టార్‌ని ఎలా చూడాలని అనుకున్నారో.. ‘ఓజీ’ అలా కనిపించి బాక్సాఫీసు షేక్ చేశాడు పవన్. ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకోవడం పాటు.. కాసుల వర్షం కురిపించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సక్సెస్ అయినందుకు గానూ సుజిత్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును పవన్ స్వయంగా సుజిత్‌కు అందించడం విశేషం. దీంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైన దర్శకుడు ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘అత్యుత్తమ బహుమతి ఇదే.

మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. హృదయం కృతజ్ఞతతో నిండినది. నా ప్రియమైన ‘OG’ కళ్యాణ్ గారు నుండి వచ్చిన ప్రేమ, ప్రోత్సాహమే నాకు అన్నీ. చిన్ననాటి అభిమానిగా ఉండటం నుండి ఈ ప్రత్యేక క్షణం వరకు. ఎప్పటికీ పవర్ స్టార్‌కు రుణపడి ఉంటాను’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇక ఇందులో స్వయంగా పవన్ కళ్యాణ్ కారు డోర్ తీసి సుజిత్‌ని కూర్చోబెట్టారు. అలాగే మరో పిక్ డైరెక్టర్ కారుతో కూర్చోగా.. పవన్ నిల్చోని దర్శకుడితో మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం సుజిత్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది చూసిన పవన్ అభిమానులు స్టార్‌డమ్‌కు మించిన మనసు పవన్‌ది.. నిజమైన స్టార్ ఇలా ఉండాలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుజిత్ ఎమోషనల్ పోస్ట్: ఆనందంతో ఉబ్బితబ్బిబు

పవన్ కళ్యాణ్ గొప్ప మనసుపై ప్రశంసలు

పవన్ కళ్యాణ్ తన డైరెక్టర్‌కు ఇచ్చిన ఈ ల్యాండ్ రోవర్ బహుమతి టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇది సుజిత్ ఆనందాన్ని పతాక స్థాయికి చేర్చడమే కాకుండా, పవన్ గొప్ప మనసును మరోసారి చాటిచెప్పింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.