
📌 Key Points
- ‘పెద్ది’ ఇష్యూపై టాలీవుడ్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ ను కలవడం సంచలనం.
- రెంటల్, పర్సెంటేజ్ విధానాలపై పవన్ కళ్యాణ్ కు నిర్మాతల కీలక వివరణ.
- థియేటర్స్ విద్యుత్ ఛార్జీలు, సింగిల్ స్క్రీన్ సమస్యలపై జనసేనానితో చర్చ.
- సమస్యల పరిష్కారానికి మంత్రి కందుల దుర్గేశ్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు.
టాలీవుడ్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న ‘పెద్ది’ ఇష్యూపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు! నిర్మాతల కీలక భేటీ, చర్చలు, జనసేనాని ఇచ్చిన హామీలు ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వైరల్ న్యూస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం!
పెద్ది ఇష్యూ: అసలు వివాదం ఏంటి?
Pawan Kalyan : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానంలో అయితేనే పెద్ది సినిమా రిలీజ్ చేస్తామని అల్టిమేటం జారీ చేసారు. నిర్మాతలు మాత్రం రెంటల్ విధానమే కావాలంటున్నారు. ఇప్పటికే ఈ వివాదం మీద టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఫిలింఛాంబర్ తో మీటింగ్స్ పెట్టుకున్నారు.
అయినా ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సమస్యపై కలిశారు. అయితే ఈ సమస్య ఎప్పట్నుంచో ఉన్నా పెద్ది సినిమాని టార్గెట్ చేసే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్ళీ హడావిడి చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. పెద్ది సినిమాకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా మేము మాత్రం పెంచము అంటూ ఎగ్జిబిటర్లు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెంటల్ విధానమే కావాలి అని కోరుకునే పలువురు నిర్మాతలు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు.
పవన్ కళ్యాణ్ తో నిర్మాతల కీలక భేటీ
ప్రస్తుతం పవన్ రాజమండ్రి పర్యటనలో ఉండగా అక్కడికే వెళ్లి కలిశారు. ఈ మీటింగ్ లో నిర్మాతలు రవి శంకర్, కిలారు సతీష్, నాగవంశీ, సాహు గారపాటి.. మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ని కలిశారు.
సమస్యల పరిష్కారానికి జనసేనాని ఆదేశాలు
ఈ మీటింగ్ లో పర్సెంటేజ్, రెంటల్ విధానం గురించి, సింగిల్ స్క్రీన్స్ కష్టాల గురించి, పెద్ది సినిమా రిలీజ్ గురించి మాట్లాడినట్టు సమాచారం. ఈ సమస్యలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది. అలాగే థియేటర్ల నిర్వహణ వ్యయం పెరగడంతో విద్యుత్ చార్జీల్లో రాయితీ ఇచ్చేవిధంగా ఆలోచన చేయాలని కోరినట్టు సమాచారం. వీటితో పాటు థియేటర్స్ కి సంబంధించిన పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు టాలీవుడ్ నిర్మాతలు. దీంతో నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న పవన్ నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ను ఆదేశించారు.
‘పెద్ది’ ఇష్యూపై పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవ టాలీవుడ్‌లో కొత్త ఆశలు రేపుతోంది. ఈ సమస్యకు పరిష్కారం లభించి, సినిమా పరిశ్రమ తిరిగి పుంజుకుంటుందని ఆశిద్దాం. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!


