
📌 Key Points
- పవన్ కళ్యాణ్, మెహర్ రమేష్ కాంబోలో సినిమా ఫిక్స్! అభిమానుల్లో షాక్!
- పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై భారీ చిత్రం!
- గతంలో ‘బ్రో’ సినిమా చేసిన పవన్, ఇప్పుడు మెహర్ తో మరో ప్రయత్నం!
- ఒరిజినల్ స్క్రిప్ట్‌తో మెహర్ రమేష్, పవన్ కోసం అదిరిపోయే కథ సిద్ధం!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.
మెహర్ రమేష్‌తో పవన్ కళ్యాణ్ సినిమా: అసలు విషయం ఏంటి?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నా తనకు ఆదాయం ఇచ్చేది సినిమా ఒకటే అని అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. త్వరలో మార్చ్ 26న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో రాబోతున్నారు. ఒకవేళ పవన్ హీరోగా చేసినా చేయకపోయినా నిర్మాతగా సినిమాలు తీస్తానని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రకటించి నిర్మాత టిజి విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేతులు కలిపారు.(Pawan Kalyan)
అసలే నష్టాల్లో, వరుస ఫ్లాప్స్ లో ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ నిర్మాతగా సినిమాలు చేయడానికి చేతులు కలపడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కానీ పవన్ కి టిజి విశ్వప్రసాద్ ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాడని తెలుసు కాబట్టి ఓకే అనుకున్నారు. కొన్ని రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పవన్ కళ్యాణ్ మరో ప్రయత్నం!
తాజాగా మరో సినిమాని కూడా పవన్ ఓకే చేసినట్టు టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ గతంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బ్రో సినిమా చేసారు. ఆ సినిమా బాగున్నా కమర్షియల్ గా అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మరో సినిమా చేస్తానని పవన్ మాటిచ్చాడట. ఆ సినిమాకు మొదట వంశీ పైడిపల్లి దర్శకుడు అనుకున్నారు కానీ చివరికి మెహర్ రమేష్ ని ఫైనల్ చేశారట. మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ పై మెహర్ రమేష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ఓకే అయిందని తెలుస్తుంది.
మెహర్ రమేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా?
దీంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మెహర్ రమేష్ కెరీర్ లో బిల్లా తప్ప మరో హిట్ లేదు. మెహర్ రమేష్ ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తారని తెలిసిందే. గతంలో మెహర్ రమేష్ ఓ ఇంటర్వ్యూలో ఎప్పటికైనా పవన్ తో సినిమా చేస్తానని అన్నాడు. ఇప్పుడు ఆ మాట నిజం కానుంది. మెహర్ రమేష్ కి పవన్ తో ఎప్పుడో కెరీర్ ఆరంభం నుంచి అనుబంధం ఉంది. మరి మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ తో అయినా హిట్ కొడతాడా చూడాలి. మెహర్ ఒరిజినల్ స్క్రిప్ట్ తోనే ఈ సినిమాని రెడీ చేస్తున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ అయితే మెహర్ డైరెక్షన్ లో సినిమా అంటే భయపడుతున్నారు.
పవన్ కళ్యాణ్, మెహర్ రమేష్ కాంబినేషన్లో సినిమా అంటేనే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


