|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై అంబటి రాంబాబు రివ్యూ చూశారా.. దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ..

Published: 26-09-2025, 8:56 AM
పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై అంబటి రాంబాబు రివ్యూ చూశారా.. దానయ్య దండగ పడ్డావయ్యా అంటూ..

పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ సంచలనం రేపుతోంది. ‘దానయ్య దండగ పడ్డావయ్యా’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Key Points

1

పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకు మంచి రివ్యూలు, రికార్డు బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చాయి.

2

వైసీపీ నేత అంబటి రాంబాబు 'దానయ్య దండగ పడ్డావయ్యా' అంటూ ఓజీపై నెగిటివ్ ట్వీట్ చేశారు.

4

ఓజీ నాన్ పాన్ ఇండియా మూవీగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

అంబటి రాంబాబు వివాదాస్పద ట్వీట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ గురువారం (సెప్టెంబర్ 25) రిలీజై మంచి రివ్యూలు, తొలి రోజే రికార్డు బాక్సాఫీస్ కలెక్షన్లు సాధించింది. అయితే దీనిపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఇచ్చిన రివ్యూ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాను తొలి రోజే చూసిన ఆయన.. గురువారం రాత్రి ట్వీట్ చేశారు.

ఓజీ మూవీకి తొలి రోజే మిక్స్‌డ్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే అంబటి రాంబాబు మాత్రం పెదవి విరిచారు. తన ప్రత్యర్థి అయినా పవన్ సినిమా హిట్ కావాలని కోరుకున్నా.. ఫలితం శూన్యం అని అనడం గమనార్హం. “ప్రత్యర్ధి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం.. దానయ్య..దండగ పడ్డావయ్యా” అని ట్వీట్ చేశారు.

నిజానికి అంతకుముందు సినిమా రిలీజ్ కు ముందు కూడా ట్వీట్ చేయడం గమనార్హం. “పవన్ జి… “OG”.. సూపర్ డూపర్ హిట్టై దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నాను” అని రాంబాబు అన్నారు. అయితే సినిమా మాత్రం తాను ఆశించినట్లుగా లేదన్నట్లుగా ఆ తర్వాత ట్వీట్ చేశారు.

ఓజీ తొలి రోజు రికార్డు కలెక్షన్లు

సుజీత్ డైరెక్ట్ చేసిన ఓజీ మూవీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రం పూనకాలు తెప్పిస్తోంది. స్టైలిష్ అవతార్ లో పవన్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీంతో ఈ సినిమాతో పవన్ కల్యాణ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ sacnilk ప్రకారం ఓజీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాన్ పాన్ ఇండియా మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది.

ఓజీ మూవీ ఇండియాలో పెయిడ్ ప్రివ్యూలతో రూ.20.25 కోట్ల నెట్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఆ పైన బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఈ సినిమా అద్భుతమైన రూ.70.75 కోట్లను జోడించింది. దీంతో ఫస్ట్ రోజు ఓజీకి ఇండియాలో రూ.91 కోట్ల నెట్ వసూళ్లు దక్కాయి.

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందం

ఇక ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియాలోనూ అదరగొట్టింది. ఇది యూఎస్ లో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో 3 మిలియన్ డాలర్లు (రూ.26 కోట్లు) సంపాదించింది. ఓవరాల్ గా ఓజీ ఓవర్సీస్ ఓపెనింగ్స్ సుమారు 6 మిలియన్ డాలర్లు (రూ.50 కోట్లు)గా అంచనా. ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఓజీకి రూ.155 కోట్ల భారీ ఓపెనింగ్ దక్కింది.

ఓజీ మూవీలో పవన్ కల్యాణ్ తోపాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఓజాస్ గంభీరా (పవన్ కళ్యాణ్) అనే గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది అతను మరో క్రైమ్ బాస్ ఓమి భావు (ఇమ్రాన్)ను చంపడానికి పదేళ్ల తరువాత బాంబేకి తిరిగి వస్తాడు.

ఓజీ మూవీకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తున్నప్పటికీ, అంబటి రాంబాబు విమర్శలు మాత్రం చర్చకు దారితీస్తున్నాయి. పవన్ అభిమానులు మాత్రం ఓజీ విజయాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వివాదం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.