|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అసుర హననం, మనలోని పౌరుషం.. `హరిహర వీరమల్లు`లోని పాటని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

Published: 20-05-2025, 4:15 AM
అసుర హననం, మనలోని పౌరుషం.. `హరిహర వీరమల్లు`లోని పాటని కీరవాణిపై పవన్‌ కళ్యాణ్‌ ప్రశంసలు

‘హరిహర వీరమల్లు’ సినిమాలోని ‘అసుర హననం’ పాటకు పవన్ కళ్యాణ్ ఫిదా అయ్యారు. ఈ పాటను విన్న తర్వాత సంగీత దర్శకుడు కీరవాణిని ప్రశంసించి శాలువాతో సత్కరించారు. మే 21న పాట విడుదల కానుంది.

Key Points

1

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'లోని 'అసుర హననం' పాటను విని కీరవాణిని ప్రశంసించారు.

2

కీరవాణి స్వరపరచిన పాటలోని వీరత్వం, పౌరుషాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

4

'అసుర హననం' పాట మే 21న విడుదల కానుంది.

‘అసుర హననం’ పాట విడుదల

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా `హరిహర వీరమల్లు` మూవీ రూపొందుతుంది. నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. వచ్చే నెలలో సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

అయితే ఈ మూవీలోని రెండో పాటని `అసుర హననం`ని రేపు బుధవారం(మే 21)న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో పవన కళ్యాణ్‌ని కలిశారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి. ఈ సందర్భంగా రేపు విడుదల చేయబోతున్న పాట గురించి పవన్ కి వివరించారు. వినిపించారు.

పాట విన్న పవన్‌ .. కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఆయన్ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, `మనలోని పౌరుషం… వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదు` అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే- ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి.

‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుంది. నేటి పరిస్థితులలో మనందరిలో వీరత్వం చేవజారిపోకూడదని చర్నాకోలతో చెప్పినట్లు అనిపించింది. ఈ పాటను 21వ తేదీన అందరికీ విన్పించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రశంసలు

`హరిహర వీరమల్లు` చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను.

‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే… అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణిలో అంకిత భావాన్ని తెలియచేస్తోంది.

ఈ రోజు ఉదయం ఆస్కార్ గ్రహీత కీరవాణి గారిని కలిసి సాగించిన సంభాషణ ఎంతో సంతోషాన్ని కలిగించింది. సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర శిష్యరికం నుంచి సరస్వతి పుత్రులైన వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వరకూ తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి చెబుతుంటే సమయం తెలియలేదు.

కీరవాణి గారి దగ్గర ఉన్న వయొలిన్లు చూసి వాటి గురించి మాట్లాడుకొంటున్నప్పుడు.. నేను వయొలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకూ నేర్చుకొని వదిలేయడం గుర్తుకు వచ్చింది. చిదంబరనాథన్ ఇచ్చిన వయొలిన్ ను ఎంత భద్రంగా దాచుకున్నారో చూపించారు కీరవాణి.

కీరవాణి సంగీతం

తెలుగు కథలను ప్రేమించే కీరవాణి గారు తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకొన్నారు. వాటిని నాకు బహూకరించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అందులో కీరవాణి గారు రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి.

ఆయన సరిగమలతో బాణీలు కూర్చే కూర్పరి మాత్రమే కాదు… చక్కటి తెలుగు పదాలతో గీతాలు అల్లగల నేర్పరి కూడా. తన పదాలతో గీత రచయితలకు మార్గం వేస్తారు. తెరపై కనిపించేది రెండున్నర గంటల సినిమాయే కానీ కీరవాణి రోజుల తరబడి, నెలల తరబడి ఆ సినిమా కోసం తపనపడతారు.

సృజనాత్మక స్వరాలతో మైమరపిస్తూ తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకువెళ్లారు` అంటూ కీరవాణిపై డిప్యూటీ సీఎం పవన్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వీరు కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణలు కూడా ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ప్రశంసలతో ‘అసుర హననం’ పాట విడుదలకు మరింత ఆసక్తి పెరిగింది. కీరవాణి సంగీతం ‘హరిహర వీరమల్లు’కి ప్రాణం పోసిందని పవన్ అభిప్రాయపడ్డారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.