
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్ర నిర్మాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్, తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి ఇచ్చారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Key Points
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ నిర్మాతకు తీసుకున్న అడ్వాన్స్ 11 కోట్లు తిరిగి ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతకు పవన్ కళ్యాణ్ సహాయం చేశారు.
సినిమా విడుదలపై ఒత్తిడి తీసుకోకుండా ఉండమని రత్నంకు పవన్ చెప్పారు.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గొప్ప మనసుకు ప్రశంసలు వస్తున్నాయి.
హరిహర వీరమల్లు నిర్మాతకు పవన్ సహాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనుపమ్ కేర్, అనసూయ, పూజా పొన్నాడ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. హరి హర వీరమల్లు మూవీ నిర్మాత రత్నం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్ తీసుకున్న అడ్వాన్స్‌కు వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు రూ. 11 కోట్లు తీసుకున్న ఆయన వెనక్కి తిరిగి ఇవ్వడంతో పాటు సినిమా విడుదలపై ప్రెషర్ తీసుకోకుండా రిలీజ్ చేసుకోమని రత్నంకు చెప్పారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సిద్దు జొన్నలగడ్డ కూడా జాక్ సినిమాకు తీసుకున్న పారితోషికంలోని రూ. 4.75 కోట్లలో సగం నిర్మాతకు తిరిగి ఇచ్చిన విషయం తెలిసిందే.
11 కోట్ల అడ్వాన్స్ తిరిగి ఇచ్చిన పవన్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
పవన్ కళ్యాణ్ యొక్క ఈ మంచి పనికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన గొప్ప మనసు అందరినీ ఆకట్టుకుంటోంది. హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని అభిమానులు ఆశిస్తున్నారు.


