|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ విధ్వంసం: 2027 సంక్రాంతి టార్గెట్! బాక్సాఫీస్ బద్దలే!!

Published: 07-02-2026, 9:35 PM
పవన్ కళ్యాణ్ విధ్వంసం: 2027 సంక్రాంతి టార్గెట్! బాక్సాఫీస్ బద్దలే!!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబో మూవీ 2027 సంక్రాంతికి విడుదల, అభిమానులకు పండగే!
  • ఉగాదికి గ్రాండ్ ఓపెనింగ్, ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథతో పవన్ కళ్యాణ్ విశ్వరూపం!
  • రామ్ తాళ్లూరి నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించారు.
  • చిరంజీవి, రజినీకాంత్ పోటీలో పవన్.. సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారో చూడాలి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఇది ఒక అదిరిపోయే న్యూస్. పవన్ కళ్యాణ్ మళ్లీ సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఈసారి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక భారీ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

2027 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ మూవీ?

Pawan Kalyan : నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ హీరోగా ఇటీవల కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథ అని, ఇందులో పవన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని టాలీవుడ్ సమాచారం.(Pawan Kalyan)

తాజాగా ఈ సినిమాపై అదిరిపోయే అప్డేట్ వినిపిస్తుంది. ఉగాది రోజు ఈ సినిమా ఓపెనింగ్ జరగనుందట. అలాగే ఈ సినిమాని రాబోయే 2027 సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత రామ్ తాళ్లూరి, దర్శకుడు సురేందర్ రెడ్డి ఇద్దరూ అనుకోని పవన్ కి చెప్తే మీ ఇష్టం అన్నారట. 2027 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఉగాదికి గ్రాండ్ ఓపెనింగ్!

అయితే సినిమా రిలీజ్ డేట్ అనుకున్నారు కానీ సినిమా షూటింగ్ అవుతుందా లేదా అనేది సందేహం. పవన్ రాజకీయాల బిజీవల్ల డేట్స్ చాలా తక్కువగా ఇస్తారు. ఉగాదికి ఓపెనింగ్ తర్వాత పవన్ డేట్స్ ఇవ్వనున్నారు. అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దసరా లోపు షూట్ పూర్తిచేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసి సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ లో ఉన్నారు. మరి పవన్ అనుకున్నట్టు డేట్స్ ఇవ్వగలడా చూడాలి.

గతంలో పవన్ కళ్యాణ్ గోపాల గోపాల, అజ్ఞాతవాసి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఇందులో గోపాల గోపాల యావరేజ్ గా నిలవగా అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయింది. మరి ఈ సంక్రాంతికి పవన్ హిట్ కొడతాడా చూడాలి. ఇక పవన్ నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 26న రిలీజ్ కానుంది.

రాజకీయాలతో సినిమాకు ఆటంకం?

2027 సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి, అనిల్ రావిపూడి, శర్వానంద్, రజినీకాంత్, నాగవంశీ సినిమాలు ఉన్నాయి. మరి ఫైనల్ గా ఎవరు తగ్గుతారు ఎవరి సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి.

పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. ఒకవేళ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర యుద్ధమే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.