|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ vs మెగాస్టార్ vs నటసింహం: 2027 సంక్రాంతి ఫైట్ ఫిక్స్! బాక్సాఫీస్ బద్దలే!

Published: 07-02-2026, 11:35 AM
పవన్ కళ్యాణ్ vs మెగాస్టార్ vs నటసింహం: 2027 సంక్రాంతి ఫైట్ ఫిక్స్! బాక్సాఫీస్ బద్దలే!
  • పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబోలో భారీ చిత్రం, త్వరలో ప్రారంభం!
  • 2027 సంక్రాంతికి చిరంజీవి, బాలయ్యతో పవన్ కళ్యాణ్ పోటీ!
  • వక్కంతం వంశీ స్క్రిప్ట్, రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
  • ఉగాదికి ప్రారంభం, అజ్ఞాతవాసి తర్వాత సంక్రాంతికి పవన్ మూవీ విడుదల!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా పండగే! సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ మాస్ ఎంటర్టైనర్తో పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది.

సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరగా ఓజీ చిత్రంతో హిట్ అందుకుని అభిమానుల దాహం తీర్చారు. అంతకు ముందు విడుదలైన హరి హర వీరమల్లు తీవ్రంగా నిరాశపరిచింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ మూవీ స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకుంది. సమ్మర్ లో పవన్ నటించిన మరో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతోంది. మార్చి 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు.

దీనితో పవన్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ షిప్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం మాస్ అండ్ స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి రచయిత.

2027 సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్!

ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఉగాదికి ప్రారంభించి 2027 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని రామ్ తాళ్లూరి.. పవన్ ని అడిగారట. దీనితో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అజ్ఞాతవాసి తర్వాత సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పవన్ మూవీ ఇదే అవుతుంది.

2027 సంక్రాంతికి ఇప్పటికే పలు చిత్రాలు రిలీజ్ కంఫర్మ్ చేసుకున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి – బాబీ మెగా 157, బాలకృష్ణ నటించబోయే చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. అనిల్ రావిపూడి, వెంకటేష్ మూవీ కూడా సంక్రాంతికే ఉంటుంది. నాగార్జున కూడా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

చిరంజీవి, బాలయ్యకు పవన్ సవాల్!

2027 సంక్రాంతి ఇప్పటి నుంచే రద్దీగా మారినట్లు అనిపిస్తోంది. అయినప్పటికీ సంక్రాంతి బరిలో తాను కూడా ఉన్నాను అంటూ పవన్ సంకేతాలు ఇచ్చేశారు. అయితే పవన్ రాజకీయాలకు సమయం కేటాయిస్తూ.. ఈ చిత్రానికి తగినన్ని డేట్లు ఇవ్వడం పెద్ద టాస్క్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

పవన్ కళ్యాణ్ రాకతో 2027 సంక్రాంతి మరింత రసవత్తరంగా మారనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.