
📌 Key Points
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు బాలీవుడ్ మూవీ ‘ధురందర్ 2’ రూపంలో దెబ్బ తగిలింది.
- మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ తీసి నష్టాలు మిగిల్చిన మెహర్ రమేష్ కంటే హరీష్ శంకర్ దారుణంగా తయారయ్యాడని టాక్.
- మొదటి రోజు రూ.41.01 కోట్లు వసూలు చేయగా, రెండో రోజుకి రూ.10.62 కోట్లకు పడిపోయాయి.
- ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.126 కోట్లు కాగా, మొదటి వీకెండ్ ముగిసేసరికి వచ్చింది కేవలం రూ.60.8 కోట్లు మాత్రమే.
పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోవడంతో సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే ప్రమాదం ఉంది.
‘ఉస్తాద్’కు షాక్ ఇచ్చిన బాలీవుడ్ మూవీ
Ustaad Bhagat Singh : ఒకప్పుడు టాలీవుడ్‌లో మెగా పవర్ అంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది, కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద వేస్తున్న పల్టీలు చూస్తుంటే మెగా బ్రాండ్ ఇమేజ్ మసకబారుతుందా అన్న డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
హిందీ సినిమా ‘ధురందర్’ ధాటికి ‘గబ్బర్ సింగ్’ గల్లంతు! నిజానికి మార్చి 19న విడుదలైన ఈ సినిమాకు బాలీవుడ్ మూవీ ‘ధురందర్ 2’ రూపంలో చావుదెబ్బ తగిలింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు సినిమా కంటే హిందీ సినిమాకే ఎక్కువ వసూళ్లు రావడం మెగా ఫ్యాన్స్‌కు మింగుడుపడని చేదు నిజం కాగా, హరీష్ శంకర్ రొటీన్ మేకింగ్ మరియు పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు హిందీ కంటెంట్ ముందు ‘బచ్చా’ అయిపోయాయని నెటిజన్లు దారుణంగా రోస్ట్ చేస్తున్నారు.
ఫ్లాప్ సినిమాలతో మెగా ఫ్యామిలీకి కష్టాలు
వరుస ఫ్లాపుల మెగా పరంపర… దీనికి తోడు మెగా ఫ్యామిలీకి ఈ మధ్యకాలం ఒక పీడకలలా మారింది, ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన ‘భోళా శంకర్’ నుండి నిన్నటి ‘హరిహర వీరమల్లు’ దాకా అందరి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. మధ్యలో ‘OG’, ‘మన శివశంకర వరప్రసాద్ గారు’ వచ్చి కొంచెం ఊపిరి పోసినా ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు సరికదా, ‘ఉస్తాద్’ ఆ హిట్ ట్రాక్‌ను దారుణంగా తుంచేసింది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ తీసి 60 శాతం నష్టాలు మిగిల్చిన మెహర్ రమేష్ కంటే దారుణంగా ఇప్పుడు హరీష్ శంకర్ తయారయ్యాడని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘అజ్ఞాతవాసి’కి ఉన్న ఓపెనింగ్స్ కూడా ఈ సినిమాకు రాలేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు ఓవరాల్ గా రూ41.01 కోట్లు వచ్చిన వసూళ్లు రెండో రోజుకే రూ.10.62 కోట్లకు పడిపోవడం, ఆదివారం సెలవు రోజు కూడా కనీసం రూ.10 కోట్ల మార్కును అందుకోలేకపోవడం, ఇక మండే కూడా ఖాళీ సీట్లు దర్శనమివ్వడం చూస్తుంటే ఈ ‘ఉస్తాద్’ పని ఇక్కడితో ఖతమైనట్లేనని స్పష్టమవుతోంది.
థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ? మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సుమారు రూ.126 కోట్లు కాగా, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వాలంటే కనీసం రూ.200 కోట్ల గ్రాస్ రావాలి, కానీ మొదటి వీకెండ్ ముగిసేసరికి వచ్చింది కేవలం రూ.60.8 కోట్ల గ్రాస్ మాత్రమే. అంటే కనీసం 40 శాతం పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు సరికదా, ఓవర్‌సీస్‌లో 70 శాతం నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు లెక్కలు కడుతున్నారు. చివరగా సోమవారం బుకింగ్స్ చూస్తుంటే చాలా చోట్ల నెగిటివ్ షేర్ నమోదయ్యేలా ఉంది, అంటే థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవు. మెహర్ రమేష్ ‘భోళా శంకర్’ అట్టర్ ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్‌తో కొంత రికవరీ చేసింది, కానీ ‘ఉస్తాద్’ ఆ పని కూడా చేయలేక మెహర్ కంటే పెద్ద డిజాస్టర్‌గా మారబోతోందని ఇన్ సైడ్ టాక్ . మేకర్స్ ఇకనైనా గబ్బర్ సింగ్ కాలం నాటి మేకింగ్ మార్చుకోకపోతే టాలీవుడ్ హిస్టరీలో మెమోరీగా మిగిలిపోవడం ఖాయం.
థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రాని పరిస్థితి
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కలెక్షన్లు ఆందోళనకరంగా ఉన్నాయి. అనుకున్న స్థాయిలో వసూళ్లు రాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సినిమా ఏ మేరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.


