|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ రెమ్యూనరేషన్ పై సంచలన ప్రకటన చేసిన మైత్రి మూవీస్! అసలు నిజం ఇదిగో!

Published: 18-03-2026, 11:05 AM
ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ రెమ్యూనరేషన్ పై సంచలన ప్రకటన చేసిన మైత్రి మూవీస్! అసలు నిజం ఇదిగో!
  • ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది.
  • ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
  • పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఇంకా తీసుకోలేదని నిర్మాత నవీన్ తెలిపారు.
  • సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి పవన్ రాజకీయ కారణాలు కూడా ఒక కారణం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ సినిమా కోసం పవన్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని నిర్మాత నవీన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల ఎప్పుడు?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు . పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల కంటే ముందుగా కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు పూర్తి చేస్తూ ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఓజి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచునాలు ఉన్నాయి.

ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా పవన్ రెమ్యూనరేషన్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన నవీన్ ఈ విషయంపై స్పందించారు. ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మీడియా వారి నుంచి పవన్ రెమ్యూనరేషన్ పట్ల ప్రశ్నలు ఎదురయ్యాయి.

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పై మైత్రి మూవీస్ నిర్మాత నవీన్ క్లారిటీ

ఈ సినిమా ప్రారంభమై దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఏమైనా వెనక్కి ఇచ్చారా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నవీన్ సమాధానం చెబుతూ ఈ సినిమా 2023లో పది రోజులు మాత్రమే షూటింగ్ చేశాము ఆ తర్వాత షూటింగ్ చేయలేదని, ఇటీవల మూడు నెలలు కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్ జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా పవన్ రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదట్లో అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారు. ఈ అడ్వాన్స్ కాకుండా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

పవన్ రెమ్యూనరేషన్ పై క్లారిటీ..

రెమ్యూనరేషన్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన నవీన్

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇలా షూటింగ్ ఆలస్యం కావడంతో పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ విషయంలో మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదని, ఆయనకు మేము ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ నవీన్ పవన్ రెమ్యూనరేషన్ గురించి క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నింటికీ చెక్ పెట్టినట్టు అయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన శ్రీ లీలకు మూడు కోట్ల రెమ్యూనరేషన్, రాశీ కన్నాకు రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. మైత్రి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ అందించారు.

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్న వార్తలకు నిర్మాత నవీన్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు తెరపడింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.