
📌 Key Points
- పవన్ కళ్యాణ్ స్వాగ్, ఎనర్జీతో అదరగొట్టారు: ట్విట్టర్ రివ్యూ.
- తమన్ మ్యూజిక్, హరీష్ డైలాగ్స్‌కు ఫ్యాన్స్ ఫిదా.
- ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయింది, సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు.
- ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్.. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు ట్విట్టర్‌లో వస్తున్న రివ్యూలు చూస్తే షాక్ అవుతారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ అంటున్నారు.
ట్విట్టర్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు!
Pawan Kalyan Ustaad Bhagat Singh Twitter Review In Telugu: పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మరోసారి వచ్చిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్సుగా నటించిన ఈ సినిమా ఇవాళ విడుదల అయింది. మరి ఈ సినిమాపై టాక్ ఎలా ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
UBS Twitter Review: పవర్ స్టార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ టాలీవుడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్‌కు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
హరీష్ శంకర్‌కు క్షమాపణలు తెలుపుతున్న ఫ్యాన్స్!
“ఆఖరికి ఉస్తాద్ భగత్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టేశాం బాబాయ్ పవన్ కల్యాణ్. హరీష్ శంకర్ థ్యాంక్యూ స్వామీ. మళ్లీ మా బాబాయ్‌ను ఇలా చూస్తా అనుకోలే..” అంటూ రామ్ చరణ్ వీడియో క్లిప్‌ను పంచుకున్నాడు ఓ అభిమాని.
“అమ్మతోడు చచ్చిపోతారు. అసలు కల్యాణ్‌ని ఇలా చూస్తాను అనుకోలేదు. పవన్ కల్యాణ్ అభిమానిగా డిమాండ్ చేస్తున్నా ఆయన అన్ని సినిమాలకు హరీష్ శంకర్‌ను పర్మినెంట్ డైరెక్టర్‌గా, తమన్ అన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ కల్యాణ్ లవ్ యూ లవ్ యూ” అంటూ మరొకరు రాసుకొచ్చారు.
బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూశాను. బ్లాక్ బస్టర్ మూవీ. పవన్ కల్యాణ్ టాప్ క్లాస్ మోడ్‌లో ఉన్నారు. ఆరా, స్వాగ్, ఎనర్జీ ఫుల్‌గా నిండిపోయింది. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ అదిరిపోయింది. కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ, తమన్ ఎలక్ట్రిఫైయింగ్ బీజీఎమ్, హరీష్ శంకర్ క్యాచీ డైలాగ్స్ ప్రధాన ప్లస్‌లు. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్. కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఇచ్చి పడేసే సినిమా ఇది.. బాక్సాఫీస్ ఇరగదీస్తుంది” అని ఒకరు రివ్యూ ఇచ్చారు.
“పవన్ కల్యాణ్ చైల్డ్ హుడ్ పోర్షన్స్ చాలా బాగా రాసుకున్నారు. పవన్ కల్యాణ్ ఎంట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫస్టాఫ్ చాలా బాగా సాగింది. సారీ హరీష్ (శంకర్ డైరెక్టర్) తక్కువ అంచనా వేసినందుకు” అని ఒకరి చెప్పుకొచ్చారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


