
తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన సినిమా ఓటీటీలోకి రాబోతోంది. 9.2 IMDb రేటింగ్‌తో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న తమిళ సినిమా ‘గెవి’ ఆగస్టు 27 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అణచివేతకు వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని ఈ సినిమా చూపుతుంది.
Key Points
9.2 IMDb రేటింగ్‌తో సూపర్ హిట్ తమిళ సినిమా ‘గెవి’
అణచివేత, అవినీతిపై సాగే ఉత్కంఠభరితమైన పోరాటం
అడవి గ్రామంలోని ప్రజల కష్టాలను చిత్రించే కథ
‘గెవి’ సినిమా విశేషాలు
కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు, సిరీస్ లు క్యూ కట్టబోతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళ లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ ‘గెవి’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది.
తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ‘గెవి’. ఈ ఏడాది జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పాజిటివ్ రివ్యూస్ తో సాగిపోయింది. ఐఎండీబీ లో ఈ చిత్రానికి ఏకంగా 9.2 రేటింగ్ దక్కడం విశేషం. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 27 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
కథాంశం: అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
గెవి సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. అణచివేతపై జరిగిన పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా జులై 18న థియేటర్లో రిలీజైంది. ఫస్ట్ డే నుంచి మంచి రివ్యూస్ తో సాగిపోయింది. ఈ సినిమాకు స్టోరీ, డైరెక్టర్ తమిళ్ దయాలన్. ఇందులో షీలా రాజ్ కుమార్, జాక్వెలిన్, ఆధవన్, ఛార్లెస్ వినోత్, వివేక్ మోహన్, జీవ సుబ్రహ్మనియన్, గాయత్రి, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీన తదితరులు నటించారు.
133 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లకు వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ గెవి. నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏ సౌకర్యాలు లేని, కనీస వసతుల్లేని అడవిలోని ఓ గ్రామంలోని ప్రజల కష్టాల చుట్టూ సాగుతుంది. కొడైకనాల్ సమీపంలో ప్రపంచానికి దూరంగా విసిరేసినట్లుగా ఓ కుగ్రామం ఉంటుంది. ఇందులో మంధరై, మలైయన్ దంపతులు. సామాజిక అసమానత, అవినీతికి బాధితులు వీళ్లు.
ఓటీటీ రిలీజ్ వివరాలు
అణచివేత కారణంగా ఈ ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయన్నది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది. కేవలం వాళ్ల హక్కుల కోసమే కాదు, గ్రామంలోని ప్రజల కోసం, అవినీతి, అణచివేతపై పోరాటం చేస్తారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు అన్ని గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఎంగేజింగ్ గా సాగుతాయి. అడవి మార్గంలోనే గర్భిణీలు డెలివరీ కావాల్సిన దుస్థితి కనిపిస్తుంది. అధికార జులూం కనిపిస్తుంది.
మరి వీళ్ల పోరాటం ఎంత వరకు సాగింది? ఎలాంటి సమస్యలను దాటి వీళ్లు అనుకున్నది సాధించారు? అనేది మూవీలో చూసి తీరాల్సిందే. రా అండ్ రస్టిక్ గా ఈ మూవీలోని క్యారెక్టర్లు ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తాయి.
‘గెవి’ సినిమా థియేటర్లలో సృష్టించిన హడావిడిని ఓటీటీలో కూడా సృష్టించే అవకాశం ఉంది. 9.2 IMDb రేటింగ్ దీనికి నిదర్శనం. సన్ నెక్స్ట్‌లో ఈ సినిమాను తప్పకుండా చూడండి.


