
📌 Key Points
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ఖరారు! మార్చి 19న థియేటర్లలో సందడి
- రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా పవన్ సరసన మెరవనున్న తారలు!
- టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, ప్రేక్షకులు
- ప్రభాస్ ‘రాజా సాబ్’ అనుభవం పునరావృతం కాకూడదని పవన్ ఫ్యాన్స్ ఆందోళన!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల దగ్గర పడుతోంది. అయితే, ఈ సినిమాకు ఒక పెద్ద సమస్య ఎదురుకానుంది. ఆ సమస్య ఏమిటో తెలుసుకోవడానికి చదవండి.
టికెట్ ధరల పెంపు తలనొప్పి!
మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని మార్చి 19న విడుదల చేయనున్నారు. గత కొంతకాలంగా మన తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఏ స్టార్ హీరో సినిమా విడుదల అయినా కూడా టికెట్ ధరలను పెంచి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ప్రభాస్ సినిమాకు ఎదురైన అనుభవమే…
రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను పెంచుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేరువేరుగా అందుకు సంబంధించిన జీవోలను విడుదల చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం నుండి అధికారికంగా జీవో విడుదల అయ్యాక మాత్రమే టికెట్ ధరలను పెంచుకొని బుకింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానితో మూవీ బృందాలు టికెట్ ధరల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తూ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు జీవోలను తెచ్చుకొని హడావిడిగా బుకింగ్స్ ను ఓపెన్ చేస్తున్నారు. దానితో ప్రేక్షకులు విసిగి వేసారి పోతున్నారు.
పవన్ సీఎం కావడం కలిసొస్తుందా?
కొంతకాలం క్రితం ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ సినిమాకు సంబంధించిన టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో కూడా చాలా ఆలస్యంగా వచ్చింది. దానితో ప్రభాస్ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ బృందం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మూవీ విషయానికి వస్తే పవన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి కావడం వల్ల అక్కడ టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవో కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జీవో ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తిగా మారింది. ఏదేమైనా కూడా టికెట్ బుకింగ్స్ మాత్రం సినిమా విడుదలకు కనీసం మూడు నుంచి నాలుగు రోజుల ముందు ఓపెన్ అయితే బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు అనుకుంటున్నారు.
ఏది ఏమైనా, టికెట్ ధరల సమస్య త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిద్దాం. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల కోసం వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


