|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పవన్ కళ్యాణ్ గొప్ప మనసు: సుమన్ శెట్టికి ఊహించని అవకాశం.. అదీ గుర్తుపెట్టుకుని!

Published: 21-12-2025, 9:04 AM
పవన్ కళ్యాణ్ గొప్ప మనసు: సుమన్ శెట్టికి ఊహించని అవకాశం.. అదీ గుర్తుపెట్టుకుని!
  • బిగ్ బాస్ సీజన్ 9 నుండి చివరి వారంలో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు.
  • పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం గుర్తుపెట్టుకొని అవకాశం ఇచ్చారని సుమన్ శెట్టి వెల్లడించారు.
  • తేజ, పవన్ కళ్యాణ్ తనకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన వ్యక్తులుగా సుమన్ శెట్టి పేర్కొన్నారు.
  • బిగ్ బాస్ తర్వాత సుమన్ శెట్టి మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 9లో తన టైమింగ్ తో ఆకట్టుకున్న సుమన్ శెట్టి ఇటీవలే ఎలిమినేట్ అయ్యారు. బయటికొచ్చాక ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు పవన్ కళ్యాణ్ ఎలా గుర్తుపెట్టుకొని పిలిచి అవకాశం ఇచ్చారో వివరించారు. ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

సుమన్ శెట్టి కెరీర్ ప్రస్థానం

Suman Shetty: జయం సినిమాలో తన టైపాప్ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు సుమన్ శెట్టి. అలా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ తరువాత కూడా చాలా సినిమాలో కమెడియన్ గా, సోలో హీరోగా పలు సినిమాలు చేసాడు. కానీ, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత బిగ్ బాస్ సీజన్ 9లో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచాడు. అంతేకాదు, తన అద్భుతమైన నటనతో 14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కోసాగాడు. లాస్ట్ వీక్ ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. కానీ, ఆయన్ని చాలా మంది విన్నర్ అవుతారని భావించారు.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో ‘మగువా.. మగువా’ పాట.. విన్నర్ ఎవరో హింట్ ఇచ్చారా..

పవన్ కళ్యాణ్ గొప్ప మనసు: ఆ అవకాశం ఎలా వచ్చింది?

ఈ నేపధ్యంలోనే ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. “నేను ఇండస్ట్రీలో బాగా ఇష్టపడే వ్యక్తులు పవన్ కళ్యాణ్, తేజ. ఒకరు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఇంకొకరు అవకాశాలు లేని రోజుల్లో గుర్తుపెట్టుకొని మరీ ఛాన్స్ ఇచ్చారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఒక చిన్న పాత్ర ఉంటుంది. ఆ పాత్ర సుమన్ శెట్టి చేస్తే బాగుంటుంది అని గుర్తుపెట్టుకొని మరీ నాకు ఆ అవకాశం వచ్చేలా చేశారు. పాత్ర చిన్నదే కానీ, ఆయన నను గుర్తుపెట్టుకొని పిలిచి మరీ అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. అది నాకు చాలా స్పెషల్ మూమెంట్” అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకొచ్చాడు సుమన్ శెట్టి(Suman Shetty).

బిగ్ బాస్ తర్వాత సుమన్ శెట్టి భవిష్యత్తు

దీంతో సుమన్ శెట్టి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బిగ్ బాస్ తరువాత సుమన్ శెట్టి మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే, బిగ్ బాస్ హౌస్ లో త టైపాప్ పంచులతో రచ్చ చేశాడు సుమన్ శెట్టి. ఆడియన్స్ కి కూడా ఆ పంచులు బాగా నచ్చేశాయి. వాటిని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. కాబట్టి, ఆ క్రేజ్ ను మేకర్స్ ఉపయోగించుకుంటే మంచిదే అనే చెప్పాలి.

మొత్తానికి పవన్ కళ్యాణ్ అందించిన ఆ అవకాశాన్ని సుమన్ శెట్టి ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో, ఇకపై ఆయనకు టాలీవుడ్‌లో మరిన్ని మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ బిజీ అవుతారని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.