|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: బిడ్డని చంపడానికి దీప రెడీ! కార్తీక్ షాక్.. డాక్టర్ సంచలన నిర్ణయం!

Published: 09-02-2026, 9:35 PM
కార్తీక దీపం 2: బిడ్డని చంపడానికి దీప రెడీ! కార్తీక్ షాక్.. డాక్టర్ సంచలన నిర్ణయం!
  • కార్తీక దీపం 2: దీప తన తల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధం!
  • కార్తీక్ షాక్: దీప నిర్ణయంతో ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి!
  • డాక్టర్ ట్విస్ట్: అసలు నిజం ఫ్యామిలీకి చెప్పేందుకు సిద్ధం!
  • జ్యోత్స్న టెన్షన్: తన కూతురు నిజం బయటపడుతుందా అని భయం!

కార్తీక దీపం 2 సీరియల్ సరికొత్త ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీప తీసుకున్న సంచలన నిర్ణయం కార్తీక్ ను షాక్ కి గురిచేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

దీప సంచలన నిర్ణయం: తల్లి కోసం బిడ్డను త్యాగం!

కార్తీక దీపం 2లో 590 వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగింది. అదే సమయంలో భావోద్వేగాలు తారాస్థాయికి చేరాయి. దీప ఇంటికి వచ్చిందా అని కార్తీక్ తన తల్లికి ఫోన్ చేసి అడగడంతో ఈ ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. కానీ దీప ఇంటికి రాలేదు అని చెప్పడంతో కార్తీక్ కంగారు పెరుగుతుంది. ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి దీప హాస్పిటల్ కి వచ్చింది అని చెబుతారు.

కార్తీక్ టెన్షన్ పడుతూ హాస్పిటల్ కి వెళతాడు. అక్కడ దీపని చూసి షాక్ అవుతాడు. నీ కోసం కంగారుగా వెతుకుతున్నాను. ఇంత అర్జెంట్ గా హాస్పిటల్ కి రావలసిన అవసరం ఏంటి ? అత్తయ్యకి టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అని డాక్టర్ చెప్పారు కదా అంటూ కార్తీ దీపని ప్రశ్నిస్తాడు. టాబ్లెట్స్ వాడితే సరిపోదు అంటూ దీప ఏడుస్తూ ట్విస్ట్ ఇస్తుంది. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఆపరేషన్ చేయించకపోతే మా అమ్మ బతకదు అంటూ దీప కన్నీరు మున్నీరు అవుతుంది.

కార్తీక్ ఆగ్రహం: దీప నిర్ణయానికి షాక్!

దీప మనం ఏదో ఒకటి ఆలోచించుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. ఇంతలో డాక్టర్ కలగజేసుకుని దీప ఆల్రెడీ ఆలోచించుకుంది అని చెబుతుంది. ఆమె ఒక నిర్ణయం తీసేసుకుంది. అది చెప్పడానికే నీకు తెలియకుండా ఇక్కడికి వచ్చింది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే.. తన తల్లి ప్రాణాలు కాపాడుకోవడం కోసం బిడ్డ ప్రాణాలు వదులుకోవడానికి రెడీ అయింది. ఈ మాట వినగానే కార్తీక్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి.

నన్ను క్షమించు బావా అంటూ దీప తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. కార్తీక్ కూడా ఏడవడం ప్రారంభిస్తాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కోసం తాను ఎంతో కుమిలిపోయినట్లు దీప చెబుతుంది. నా కూతురు తన చెల్లి కోసం ఎదురుచూస్తోంది. తనతో ఆడుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడు తనకి నేను ఏం చెప్పాలి. దీనికి నేను ఒప్పుకుంటే ఆ నిర్ణయం విలువ నా కూతురి ప్రాణం అంటూ కార్తీ ఆవేదన చెందుతాడు. చివరికి దీప నిర్ణయానికి కార్తీక్ అంగీకారం తెలుపుతాడు. కానీ డాక్టర్ ఆశ్చర్యపోతుంది. మీ అత్తగారి ప్రాణం కోసం బిడ్డని వదులుకుంటారా అని షాక్ అవుతుంది.

డాక్టర్ ట్విస్ట్: నిజం చెప్పేందుకు రెడీ!

నేను వెంటనే దీని గురించి మీ ఫ్యామిలీకి చెప్పేస్తాను. నిజం చెప్పడం నా బాధ్యత అని డాక్టర్ ఇంటికి బయలుదేరుతారు. కార్తీక్, దీప కూడా వెళతారు. డాక్టర్ ఇంటికి రావడం చూసి జ్యోత్స్న, ఆమె గ్రాండ్ మదర్ కి డౌట్ వస్తుంది. తాను అసలైన కూతుర్ని కాదనే నిజం డాక్టర్ కి తెలిసిపోయిందా ? దానికి ఇప్పుడు ఆమె ఫ్యామికి చెప్పేస్తుందా అని కంగారు పడుతుంది. కానీ డాక్టర్ మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. సుమిత్ర గారి శాంపిల్స్, జ్యోత్స్న శాంపిల్స్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ చెబుతుంది. దీనితో ఆపరేషన్ సవ్యంగా జరుగుతుంది అని ఫ్యామిలీ మెంబర్స్ సంతోషిస్తారు.

కార్తీక దీపం 2లో రోజుకో ట్విస్ట్ ఎదురుచూస్తూనే ఉంది. దీప నిర్ణయం, కార్తీక్ షాక్, డాక్టర్ ట్విస్ట్ లతో కథ మరింత ఉత్కంఠగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.