|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నా పేరు, ఫోటోలు వాడొద్దు! హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. సంచలన ఆదేశాలు

Published: 22-12-2025, 5:44 AM
నా పేరు, ఫోటోలు వాడొద్దు! హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. సంచలన ఆదేశాలు
  • పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
  • అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వాయిస్ వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదని ఆయన కోరారు.
  • కోర్టు 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
  • సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసి, లింకులను తొలగించాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వాయిస్ వాణిజ్య ప్రయోజనాలకు వాడకుండా నిరోధించాలని ఆయన కోరారు. దీనిపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

పవన్ కళ్యాణ్ పిటిషన్: వ్యక్తిత్వ హక్కుల కోసం పోరాటం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ‌ ఉప ముఖ్యమంత్రి , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‌ కోర్టును ఆశ్రయించారు . తన వ్యక్తిత్వ హక్కులను (Personality Rights) కాపాడాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ‌ దాఖలు చేశారు . తన వ్యక్తిగత హక్కులు , గౌరవానికి భంగలం కలగకుండా చూడాలని న్యాయస్థానాన్ని కోరారు . పవన్ ‌ పిటిషన్ ‌ పై ఇవాళ ( డిసెంబర్ ‌ 22) న్యాయస్థానంలో విచారణ జరిగింది . తన అనుమతి లేకుండా తన పేరు , ఫోటోలు , వాయిస్ ‌ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోకుండా నిరోధించాలని పవన్ ఈ పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది . ఈ సందర్భంగా పవన్ తరపున న్యాయవాది జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికలు, ఈ-కామర్స్ సైట్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తన ప్రతిష్టను దిగజార్చేలా లేదా తన అనుమతి లేకుండా తన ఇమేజ్‌ను వాడుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక కీలక రాజ్యాంగ పదవిలో ఉన్నందున, తన వ్యక్తిత్వానికి భంగం వాటిల్లడం వల్ల తన ప్రజా జీవితంపై ప్రభావం పడుతుందని పవన్ తన పిటిషన్ పేర్కొన్నారు .

హైకోర్టు కీలక ఆదేశాలు: ఐటీ నిబంధనల ప్రకారం చర్యలు

దీనిపై ఆయన తరపు న్యాయవాది సాయి దీపక్ ‌ కోర్టులో వాదనలు వినిపించారు . ఆయన వాదనలు విన్న కోర్టు .. వారి అనుమతి లేకుండ వారి ఫోటోలు , వాయిస్ ‌, వీడియోలు వాడిన సోషల్ ‌ మీడియా సంస్థలపై 2021 ఐటీ నిబంధనల ప్రకారం చర్యలకు తీసుకోవాలని ఆదేశించింది . పవన్ కళ్యాణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ, సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా ఆయన ఇమేజ్‌ను వాడుతున్న లింకులను తొలగించాలని కూడా కోర్టు సూచించినట్లు సమాచారం లబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగించే అంశాలపై న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది .

సోషల్ మీడియా, ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు

అలాగే గతంలో జూనియర్ ‌ ఎన్టీఆర్ ‌ వేసిన పిటిషన్ ‌ పై కూడా నేడు విచారణ జరిగింది . వీరిద్దరి పిటిషన్ ‌ ను న్యాయవాది జె సాయి దీపక్ ‌ కోర్టులో వాదనలు వినిపించారు . కాగా గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులను కాపాడంటూ కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే . ప్రముఖ వ్యక్తికి సంబంధించి వారి పేరు, గొంతు, సంతకం లేదా ముఖచిత్రాన్ని వారి అనుమతి లేకుండా ఇతరులు వాణిజ్యపరంగా వాడుకోకుండా ఉండే హక్కునే ‘పర్సనాలిటీ రైట్స్’ అంటారు. గతంలో అమితాబ్ ‌ బచ్చన్ ‌, రజనీకాంత్ ‌, చిరంజీవి , అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోలు వ్యక్తిత్వ హక్కులను కోసం కోర్టును ఆశ్రయించి సానుకూలా తీర్పుని పొందారు .

ఈ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన సందేశం అందింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.