
బుల్లితెర నటి అంజలి తన భర్త పవన్ తో కలిసి యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తుంది. తాజాగా రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు వారు ప్రకటించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Key Points
అంజలి, పవన్ దంపతులకు మరో బిడ్డ
‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా పాపులర్ అయిన అంజలి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభవార్త
అంజలి యొక్క బుల్లితెర ప్రయాణం
యాంకర్‌గా, సీరియల్ నటిగా బుల్లితెర ఆడియన్స్‌కి బాగా దగ్గరైన అంజలి(Anjali) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ‘మొగలిరేకులు’(Mogali Rekulu) సీరియల్ ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం తన భర్త పవన్(Pawan), కూతురు ధన్విక (చందమామ)తో కలిసి అంజలి యూట్యూబ్ చానల్ రన్ చేస్తుంది. దీంట్లో వీళ్ల వీడియోలకి మంచి వ్యూస్ వస్తుంటాయి. ఇక సోషల్ మీడియా(Social Media)లో కూడా అంజలి-పవన్ జోడిగా మంచి క్రేజ్ ఉంది.
అయితే రీసెంట్‌గా అంజలి తన ఫ్యాన్స్‌కి తాను రెండోసారి తల్లి కాబోతున్నా అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిన్నది పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ.. ‘ఫుల్ వీడియో కమింగ్ సూన్ వి చందమామ’ అనే క్యాప్షన్ జోడించింది. అయితే పాపనో, బాబునో రివీల్ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
సోషల్ మీడియాలో అంజలి-పవన్ జంట క్రేజ్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన అంజలి
అంజలి, పవన్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొత్త బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.


