|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు నరకం చూపించాడు.. టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్నా.. పవన్ భార్య సెన్సేషనల్ కామెంట్స్

Published: 10-10-2025, 12:54 AM
నాకు నరకం చూపించాడు.. టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్నా.. పవన్ భార్య సెన్సేషనల్ కామెంట్స్

భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన భర్త పవన్ సింగ్ తనను నరకం చూపించాడని, టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్నానని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. గర్భస్రావం మందులు ఇచ్చాడని కూడా ఆరోపించింది.

Key Points

1

భోజ్‌పురి నటుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

2

పవన్ సింగ్ తనను నరకం చూపించాడని, టార్చర్ చేశాడని జ్యోతి ఆరోపణ.

4

గర్భం వచ్చిన ప్రతిసారి గర్భస్రావం మందులు ఇచ్చాడని జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది.

పవన్ సింగ్ పై జ్యోతి సింగ్ సంచలన ఆరోపణలు

భోజ్‌పురి నటుడు పవన్ సింగ్(Pawan Singh) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఓ హీరోయిన్‌గా అసభ్యంగా ప్రవర్తించి అందరి చేత తిట్లు తిన్న ఆయన చివరకు క్షమాపణలు కోరాడు. ఇక గత కొద్ది కాలంగా పవన్ సింగ్ భార్య తనను చాలా బాధపెడుతున్నాడంటూ పలు పోస్టులు పెడుతోంది. అంతేకాకుండా ఓ అమ్మాయితో ఎఫైర్ కూడా పెట్టుకున్నాడని.. అందుకే వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఈక్రమంలో.. తాజాగా, మరోసారి పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ (Jyoti Singh)సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి.. ‘‘పవన్ సింగ్ అబద్ధాలు చెబుతున్నాడు.

బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులు ఇవ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారి అలాగే చేశాడు. నన్ను ఓ రోజు అతను బలవంతం కూడా చేశాడు. అతన్ని కించపరచాలని నేను ఈ విషయాన్ని చెప్పడం లేదు. నాకు జరిగిన అన్యాయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. పవన్ నాకు ప్రతిరోజు నరకం చూపించాడు. నన్ను టార్చర్ పెట్టాడు.. అది భరించలేక నేను నిద్రమాత్రలు వేసుకునే దాన్ని. ఒకసారి ఏకంగా 25 టాబ్లెట్స్ మింగాను.. దీంతో నా సోదరులు నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి నాకు చికిత్స అందించారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టార్చర్ భరించలేక నిద్ర మాత్రలు వేసుకున్నా

గర్భస్రావం మందుల గురించి జ్యోతి ఆవేదన

పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఆమె మాటలు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వివాదంపై పవన్ సింగ్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.