|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అరుదైన వ్యాధి తో భాధపడుతున్న పాయల్‌ రాజ్‌పుత్‌ !

Updated: 21-05-2025, 8:22 AM
అరుదైన వ్యాధి తో భాధపడుతున్న పాయల్‌ రాజ్‌పుత్‌ !

తెలుగు చిత్ర పరిశ్రమ నటి పాయల్ రాజ్ పుత్ కంటి చూపులో గణనీయమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆమె ప్రతి వస్తువు రెండు రెట్లు కనిపిస్తోందని, బ్లర్డ్ విజన్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కంటి చూపులో తేడాలు

ఆర్‌.ఎక్స్. 100తో తెలుగు కుర్రకారుకు హాట్‌ ఫేవరేట్‌గా మారిపోయారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత చాలా లు చేసినా, ఆ కు వచ్చినంత పేరు తెచ్చుకోలేకపోయారు.కానీ, ఆ మధ్య వచ్చిన మంగళవారం మాత్రం మళ్లీ ఈ బ్యూటీని ఫార్మ్ లో నిలబెట్టింది.మంగళవారం సీక్వెల్‌ ఉంటుందని అజయ్‌ భూపతి చెబుతున్నారు. అయితే, సీక్వెల్‌లో పాయల్‌కి ఎంత వరకు స్కోప్‌ ఉంటుందనే విషయం మాత్రం రివీల్‌ చేయడం లేదు. అంతలో ఇతర ప్రాజెక్టుల మీద ఫోకస్‌ చేస్తున్నారు పాయల్‌.రీసెంట్‌గా ఓ షో రూమ్‌ ఓపెనింగ్‌కి వెళ్తూ తనకు వచ్చిన సమస్యను నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు పాయల్‌. ఈ మధ్య పాయల్‌ కంటి చూపులో తేడా కనిపిస్తోందట. ప్రతిదీ రెండు రెండుగా కనిపిస్తోందట. బ్లర్‌గా కూడా ఉంటోందట.ఇలాంటి ఇబ్బందుల్లో బయటకు వెళ్లకూడదని అనుకున్నా, ప్రీ కమిట్‌మెంట వల్ల వెళ్లక తప్పడం లేదని, తన సమస్యను బయటకు చెప్పడం ఇష్టం లేక కళ్లజోడుతో మేనేజ్‌ చేశానని అంటున్నారు పాయల్‌.పాయల్‌ తన సమస్య గురించి చెప్పగానే సమంత మయోసైటిస్‌, ఆదాశర్మ హెల్త్ ఇష్యూస్‌ని డిస్కస్‌ చేసుకుంటున్నారు జనాలు. తనకు ఎలాంటి వాసనలూ తెలియవని, పుట్టుకతో ఈ సమస్య ఉందని కేథరిన్‌ చెప్పిన విషయం కూడా వైరల్‌ అవుతోంది నెట్టింట్లో.

రెట్టింపు దృశ్యాలు

సోషల్ మీడియా చర్చ

పాయల్ రాజ్ పుత్ ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయడం వల్ల సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.