
Key Points
రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఫస్ట్ సాంగ్ విడుదల తేదీ!
వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25, 2025 న పాట విడుదల!
ఏఆర్ రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు సానా దర్శకత్వం!
రూ.300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న మెగా ప్రాజెక్ట్!
పెద్ది సినిమా ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్
టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ఒకటి. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రేుజీ సినిమా నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్ టాక్.
టాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన యాక్షన్ డ్రామా ‘ పెద్ది ‘ చిత్రం. రీసెంట్ గా ఈ మూవీ కోసం కండలు పెంచిన రామ్ చరణ్ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మొదటి పాట వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 25, 2025న విడుదల కానుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయిలో తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేకత
పెద్ది మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీన్ని కొనసాగించేందుకు, సినిమాపై ఆసక్తిని నిలుపుకునేందుకు చిత్ర యూనిట్ మొదటి పాటను విడుదల చేయాలని నిర్ణయించింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అభిమానులు మాత్రం ఈ క్రేజీ అప్ డేట్ తో సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో జాన్వీ కపూర్ రొమాన్స్ చేస్తోంంది.
పెద్ది సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ విలేజ్ సెట్ వేశారు. అక్కడ షూటింగ్ జరుగుతోంది. దివ్యేందు శర్మ ‘పెద్ది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. మిర్జాపూర్ ఫేమ్ హిందీ నటుడు దివ్యేందు శర్మ ఈ భారీ బడ్జెట్ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో ‘పెద్ది’ సినిమాను రూపొందిస్తున్నారు.
రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ‘పెద్ది’
బుచ్చిబాబు సానా మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని అందించారని, సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని రామ్ చరణ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఆయన గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం అందరి దృష్టి ‘పెద్ది’ సినిమాలోని మొదటి పాటపైనే ఉంది. ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.
మొత్తంమీద, రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ విడుదలతో మరింత ఆసక్తి పెరిగింది.


