|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

“పుష్ప 2” బాటలో “పెద్ది” రికార్డుల వేట: సంచలనం సృష్టిస్తుందా?

Published: 14-05-2026, 5:46 PM
"పుష్ప 2" బాటలో "పెద్ది" రికార్డుల వేట: సంచలనం సృష్టిస్తుందా?
  • “పెద్ది” చిత్రం జూన్ 4న విడుదల కానుంది.
  • “పుష్ప 2” మాదిరిగా దేశవ్యాప్త ప్రమోషన్లు చేపడుతున్నారు.
  • రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రమోషన్లలో పాల్గొంటారు.
  • తెలంగాణ ఎగ్జిబిటర్లు ‘ఫిక్స్‌డ్ రెంటల్’ వివాదంపై బాయ్‌కాట్ ప్రకటించారు.

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. ‘పుష్ప 2’ తరహాలో భారీ ప్రమోషన్లతో పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, తెలంగాణ ఎగ్జిబిటర్లు ‘ఫిక్స్‌డ్ రెంటల్’ వివాదంపై సినిమాను ప్రదర్శించబోమని ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

“పుష్ప 2” తరహా ప్రమోషన్ల వ్యూహం

Peddi Promotions : కొన్నేళ్లుగా సరైన సినిమా లేని లోటుని తీర్చేందుకు పెద్ది రూపంలో సునామీ స్ప్రుష్టించడానికి రెడీ అయ్యాడు చరణ్.ఇక ఇప్పటికే సినిమా జూన్ 4న వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా. అయితే, ఒకవైపు భారీ అంచనాలు, మరోవైపు ఎగ్జిబిటర్ల అల్టిమేటం ..వెరసి సినిమా రెండు పడవల మీద జర్నీ చేస్తున్నట్టే ఉంది.అయితే ఇవేవీ మా సినిమాని ఆపలేవంటూ ప్రమోషన్స్ లో మరింత జోరు చూపించేందుకు రెడీ అవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ కలిసి నిర్మించిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డులు కొల్లగొట్టాలని పక్కా ప్లాన్ తో వస్తుంది.

‘పుష్ప 2’ సృష్టించినప్రభంజనం

ఇక ఈ సినిమా ప్రమోషన్ల స్ట్రాటజీ గతంలో ‘పుష్ప 2’ సృష్టించినప్రభంజనం గుర్తుకు వస్తోంది. అల్లు అర్జున్ ఏలా అయితే దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశాడో , ఇప్పుడు చరణ్ కూడా అదే రూట్ మ్యాప్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నెల 18 నుంచి జూన్ 2 వరకు సాగే సుదీర్ఘ ప్రచార షెడ్యూల్‌ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్ .

పాన్ ఇండియా స్థాయిలో “పెద్ది” లక్ష్యం

‘పెద్ది’ సినిమాను ప్రదర్శించబోము

అయితే, ఇంతటి భారీ ప్రచారం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు బాంబు పేల్చారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ‘పెద్ది’ సినిమాను ప్రదర్శించబోమని వారు ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. వివాదానికి కారణం పాతకాలపు ‘ఫిక్స్‌డ్ రెంటల్’ విధానం. కోవిడ్ తర్వాత థియేటర్లు నడపడం కష్టమవుతోందని, మల్టీప్లెక్స్‌లలాగే తమకు కూడా రెవెన్యూ షేరింగ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. 23 థియేటర్లతో మొదలైన ఈ ‘బాయ్‌కాట్’ సెగ ఇపుడు స్టేట్ వైడ్ గా తాకడంతో సినిమా అసలు నైజాంలో రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్.ఒకవేళ నైజాం సింగిల్ థియేటర్స్ లో మాత్రం సినిమా పడకపోతే అది కలెక్షన్స్ కి పెద్ద దెబ్బే.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది.’పెద్ది’ సినిమాకు వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే,ఇలాంటి చిన్న చిన్న ఇష్యూలని సాల్వ్ చేసుకొని ముందుకెళితే అందరికి మంచిదన్న భావన ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరిలో కనిపిస్తుంది.చూడాలి మరి ఒక వైపు పెద్ది ప్రమోషన్ల జోరు ,మరో వైపు ఇంటి పోరు ..వీటిని తట్టుకొని చరణ్ ఎలా నిలబడతాడో చూడాలి !

తెలంగాణ ఎగ్జిబిటర్ల బాయ్‌కాట్ వివాదం

#PEDDI – Mana Cinema Aadukodam Gurinche 💥

Get ready for the games 🥰 In cinemas JUNE 4th ❤️ https://t.co/f41uSE09yc pic.twitter.com/4QChYp8BxW

— PEDDI (@PeddiMovieOffl) May 14, 2026

ఒకవైపు భారీ ప్రమోషన్లు, మరోవైపు ఎగ్జిబిటర్ల అల్టిమేటం మధ్య ‘పెద్ది’ సినిమా ప్రయాణం ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.