|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘పెద్ది’ విడుదల ఖాయం! వాయిదాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన మేకర్స్.. ఇక రచ్చ షురూ!

Published: 27-02-2026, 1:35 PM
‘పెద్ది’ విడుదల ఖాయం! వాయిదాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన మేకర్స్.. ఇక రచ్చ షురూ!
  • రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై స్పష్టతనిచ్చిన మేకర్స్.
  • ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’, ఏప్రిల్ 29న ఓవర్సీస్‌లో ప్రీమియర్స్.
  • సినిమా విడుదల వాయిదా పడుతుందన్న పుకార్లను ఖండిస్తూ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన.
  • యుఎస్‌లో ‘పెద్ది’ సినిమాను విడుదల చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ కూడా విడుదల తేదీని ధృవీకరించింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల తేదీపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా వాయిదా పడుతుందన్న వార్తలకు చెక్ పెడుతూ, ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏప్రిల్ 30నే ‘పెద్ది’ విడుదల: మేకర్స్ క్లారిటీ!

Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబోలో వస్తున్న ‘పెద్ది’ (Peddi Movie) సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా మొదట రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల అని ప్రకటించారు. రీసెంట్‌గానే షూటింగ్ పనులు పూర్తి కాలేదని ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘పెద్ది’ వాయిదా పడటంతో ఏప్రిల్‌లో అనుకున్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా, మార్చి 26కు డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది, మరి ఎవరు పుట్టించారో కానీ, మరోసారి ‘పెద్ది’ వాయిదా అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న కూడా ‘పెద్ది’ రిలీజ్ డౌటే? అనేలా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, మేకర్స్ ఓ స్ట్రాంగ్ అప్డేట్ వదిలారు.

ఆల్రెడీ రెండో సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్‌లో కూడా రిలీజ్ డేట్ ఏప్రిల్ 30నే అని ప్రకటించారు. అయినా కూడా వార్తలు ఆగలేదు. తాజాగా ఓవర్సీస్‌కు సంబంధించిన అప్డేట్‌తో ‘పెద్ది’ విడుదల విషయంలో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అవును, ఈ సినిమా ప్రీమియర్స్ ఓవర్సీస్‌లో ఏప్రిల్ 29నే పడబోతున్నాయని తెలుపుతూ, ప్రత్యంగిరా సినిమాస్ ‘పెద్ది’ని నార్త్ అమెరికాలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 29న మ్యాసివ్ రిలీజ్ ఉండబోతుందని, ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ ఉంటుందని నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలుపుతూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ సినిమాను యుఎస్‌లో విడుదల చేస్తున్న ప్రత్యంగిరా సినిమాస్ కూడా, సేమ్ అప్డేట్‌ను ట్వీట్ చేసింది. దీంతో మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వాయిదా పడే అవకాశమే లేదని, వారు సెలబ్రేషన్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

ఓవర్సీస్‌లో ఏప్రిల్ 29న ప్రీమియర్స్

ఇక నిర్మాణ సంస్థే అధికారికంగా రిలీజ్ గురించి ప్రకటించడంతో మెగాభిమానులు కామెంట్స్‌కు లిమిటే లేదు. ఏప్రిల్ 30వ తేదీన భూకంపం రావడం పక్కా, ఈ ఒక్క హింట్ చాలు చెలరేగిపోతాం.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వారి ఎగ్జయిట్‌మెంట్‌ను మరింతగా పెంచేలా మార్చి 2న రెండవ సింగిల్ ‘రై రై రా రా’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌తో సినిమాపై ఉన్న బజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళుతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే వచ్చిన ‘చికిరి చికిరి’ సాంగ్ ఎలాంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Rising from his land to conquer the world 🔥🔥 #Peddi North America release by @PrathyangiraUS ❤‍🔥

MASSIVE PREMIERES from 29th APRIL 2026 #PEDDI WORLDWIDE RELEASE ON 30th APRIL, 2026

వాయిదా వార్తలకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ

Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman … pic.twitter.com/Z19KFbzAxS

— Vriddhi Cinemas (@vriddhicinemas) February 27, 2026

ఏది ఏమైనా ‘పెద్ది’ విడుదల విషయంలో మేకర్స్ స్పష్టత ఇవ్వడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా ఏప్రిల్ 30న విడుదల కావడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.