|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది స్టోరీ: ఇది కాపీనా? రామ్ చరణ్ సినిమాపై భగ్గుమంటున్న వివాదం!

Published: 28-03-2026, 9:05 AM
పెద్ది స్టోరీ: ఇది కాపీనా? రామ్ చరణ్ సినిమాపై భగ్గుమంటున్న వివాదం!
  • రామ్ చరణ్ ‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్‌పై కాపీ ఆరోపణలు
  • సల్మాన్ ఖాన్, కిచ్చా సుదీప్ సినిమాల నుంచి కాపీ చేశారని నెటిజన్ల ట్రోల్స్
  • మెగా ఫ్యాన్స్ ట్రోల్స్‌ను తిప్పికొడుతూ గట్టి కౌంటర్
  • సినిమాలో క్రికెట్, కుస్తీ రెండూ ఉండటంతో కథపై ట్రేడ్ పండిట్స్ ఆందోళన

రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్ ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారింది. ఇది కాపీ కథ అని నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ వారికి గట్టిగా సమాధానం చెబుతున్నారు.

‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్‌పై కాపీ ఆరోపణలు

Peddi Controversy: రామ్ చరణ్ పుట్టినరోజు గిఫ్ట్ గా రిలీజ్ అయిన ‘పెద్ది పెహల్వాన్’ గ్లింప్స్ ఒకవైపు రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. అయితే ఇపుడు అదే గ్లింప్స్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఇది ఒరిజినల్ కథ కాదని , పక్కా కాపీ అంటూ వస్తున్న కామెంట్లతో అటు మెగా ఫ్యాన్స్ వర్సెస్ ట్రోలర్స్ అన్నట్టుగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్ వార్ నడుస్తుంది.

సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, కిచ్చా సుదీప్ ‘పహిల్వాన్’ సినిమాల కాపీ

తాజాగా వదిలిన 44 సెకన్ల ఈ గ్లింప్స్‌లో చరణ్‌ను కుస్తీ యోధుడిగా చూపించగా ఈ విజువల్స్ అచ్చం సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, కిచ్చా సుదీప్ ‘పహిల్వాన్’ సినిమాలను కాపీ కొట్టినట్టు ఉన్నాయని ఆరోపిస్తున్నారు నెటిజన్లు “అదే మట్టి, అదే ఎలివేషన్, అదే బాడీ లాంగ్వేజ్.. .. ఉప్పెనలో కొత్తదనం చూపించిన బుచ్చిబాబు ఇక్కడ మాత్రం పాత సినిమాలను మిక్సీలో వేసి రుబ్బేసాడు అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు ముఖ్యంగా గదతో చేసే విన్యాసాలు కూడా గతంలో చాలా సినిమాల్లో చూసేసినవే అంటూ ఏకిపారేస్తున్నారు.

ట్రోల్స్‌పై మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్

నోళ్లు మూయిస్తున్న మెగా ఫ్యాన్స్

అయితే ఇలా పెద్ది పై కాపీ క్యాట్ ఆరోపణలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఎక్కడా తగ్గడం లేదు. ముఖ్యంగా ”కుస్తీ అంటే ఇసుకలోనే ఆడతారు కానీ, ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు ఆడరు కదా!” అంటూ ట్రోలర్ల నోళ్లు మూయిస్తున్నారు.ఇక ఒక కుస్తీ ప్లేయర్ కథ అన్నప్పుడు ఆ మాత్రం పోలికలు రావడం సహజమని,ఇలా కేవలం ఒక చిన్న టీజర్ చూసి సినిమా మొత్తాన్ని జడ్జ్ చేయడం తెలివి తక్కువ పని అని,చరణ్ పడ్డ కష్టం, ఆయన లుక్ చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు మెగా ప్యాన్స్.

క్రికెట్ బ్యాట్ to పెహల్వాన్ అవతార్‌..

సినిమాలో క్రికెట్, కుస్తీ..కథపై ట్రేడ్ పండిట్స్ ఆందోళన

మరో వైపు ‘పెద్ది’ సినిమా చుట్టూ ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది. సినిమా నుండి అప్ డేట్స్ వదిలిన తొలి రోజుల్లో చరణ్ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న పోస్టర్లు దర్శనమిచ్చాయ్ .ఇప్పుడేమో పెహల్వాన్ అవతార్‌లో సందడి చేస్తున్నాడు.ఇక “కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదు.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట” అనే డైలాగ్ చూస్తుంటే, ఇది మల్టీ-స్పోర్ట్స్ డ్రామా అని క్లియర్ క్లారిటీ వచ్చేసింది. అయితే,ఇలా అన్నిఆటలని ఒకే సినిమాలో చూపిస్తే కథ కిచిడీ అయ్యే ప్రమాదం ఉందని కాస్త గట్టిగానే హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమాని ఏ ప్రిల్ 30న సమ్మర్ కానుకగా రాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు కాని ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అన్న డైలమాలోనే ఉన్నారు మూవీ లవర్స్. మొత్తానికి చరణ్ కండలు తిరిగిన బాడీ, పక్కా లోకల్ డైలాగ్ డెలివరీ సినిమాకి ప్లస్ పాయింట్లు అయితే.. కాపీ క్యాట్ అన్న ముద్ర మైనస్ అవుతోంది. మరి చరణ్ ఈ ‘పెద్ది’తో థియేటర్లలో ఏ రేంజ్ కుస్తీ పడతారో, బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను మట్టి కరిపిస్తారో కాలమే డిసైడ్ చేయాలి.

మొత్తానికి ‘పెద్ది’ సినిమా విడుదల కాకముందే వివాదాల్లో చిక్కుకుంది. కాపీ ఆరోపణలు, కథపై అంచనాలు వెరసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.