|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పెద్ది సంచలనం! బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్ వైరల్! చరణ్ లేకపోతే నేను లేను!

Published: 01-06-2026, 5:45 PM
పెద్ది సంచలనం! బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్ వైరల్! చరణ్ లేకపోతే నేను లేను!
  • “పెద్ది” జూన్ 4న పాన్ ఇండియా రిలీజ్! ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బుచ్చిబాబు ఎమోషనల్ స్పీచ్.
  • “ఉప్పెన” తర్వాత ఐదేళ్లు “పెద్ది” కోసమే! చరణ్ లేకపోతే నేను లేను అన్న బుచ్చిబాబు.
  • “పెద్ది” కమర్షియల్ కథ కాదు, ఎమోషనల్ డ్రామా! చివరి 40 నిమిషాలు కన్నీళ్లు పెట్టిస్తాయి.
  • చరణ్, జాన్వీ, అప్పలసూరి నటన అద్భుతం! బుచ్చిబాబు కామెంట్స్ ఇప్పుడు వైరల్.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు సానా చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

పెద్ది కోసం ఐదేళ్ల కష్టం! బుచ్చిబాబు ఎమోషనల్ జర్నీ

Buchibabu Sana : రామ్ చరణ్ పెద్ది సినిమా జూన్ 4 న గ్రాండ్ గా థియేటర్స్ లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

చరణ్ నమ్మకమే నా బలం! దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

ఈ ఈవెంట్లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఉప్పెన సినిమా తర్వాత ఐదేళ్లు టైం తీసుకున్నా. ఎందుకు అంటే పెద్ది కోసమే. ఉప్పెన స్టోరీ ఇక్కడే విజయవాడలో రాసుకున్నా. నేను తండ్రిని అయ్యాను అని ఇక్కడే విజయవాడలో చెప్పారు. నాకెప్పుడూ విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉంటాయి. పెద్ది కథ ఎవరికి చెప్పాలి అనుకుంటున్నప్పుడు సుకుమార్ గారు చరణ్ సర్ ని కలిపించారు. దత్తాత్రేయస్వామిని దండం పెట్టుకున్నా ఈ సినిమా ఓకే చెయ్యాలని. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చరణ్ గారు ఓకే చేసారు. ఇది కమర్షియల్ కథ కాదు. ఒక ఎమోషనల్ డ్రామా. ఆటగాడి జర్నీ.

క్లైమాక్స్ లో జాన్వీ, అప్పలసూరి అద్భుత నటన!

ఆట అంటే ఆకతాయితనం కాదు గౌరవం, గుర్తింపు తీసుకొచ్చి చుట్టూ ఉన్న మనుషులను మార్చే కథ పెద్ది. పెద్ది అంటే అలలా ఎగిసి పడిన మనిషి కథ కాదు పడినా లేచి నిలబడిన మనిషి కథ. నిజాయితీ గల హీరో నమ్మి చేస్తే పెద్ది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను ఇప్పటికే 50 సార్లు చూసాను సినిమా. చివరి 40 నిమిషాలకు ఎమోషనల్ అయిపోతారు. పెద్ది అంటే ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రాడి కథ కాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా సాగే కుర్రాడి కథ. ఇది చాలా ఇన్‌స్పిరేషనల్ జర్నీ. నన్ను నమ్మి సినిమా ఇచ్చినందుకు లైఫ్ లో ఎప్పటికి రుణపడి ఉంటాను చరణ్ సర్ కి. క్లైమాక్స్ లో జాన్వీ పర్ఫార్మెన్స్ ని కూడా మర్చిపోరు. అప్పలసూరి పర్ఫార్మెన్స్ కి మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే నేను బుచ్చిబాబు పేరు మార్చుకుంటాను. చరణ్ సర్ మీరు లేకపోతే బుచ్చిబాబు లేడు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి చరణ్ సర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఏడుస్తారు అని అన్నారు.

బుచ్చిబాబు స్పీచ్ తో ‘పెద్ది’ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.