
📌 Key Points
- రామ్ చరణ్ ‘పెద్ది’ షూటింగ్ పై కొత్త అప్డేట్ విడుదలైంది.
- కోటీ ఆస్పత్రి, ఢిల్లీలో త్వరలో కొత్త షూటింగ్ షెడ్యూల్.
- క్లైమాక్స్, ఫైటింగ్, ఐటెం సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలింది.
- ‘పెద్ది’ సినిమా మార్చి 27, 2026న విడుదల కానుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా షూటింగ్‌పై తాజా అప్డేట్ విడుదలైంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.
రామ్ చరణ్ ‘పెద్ది’ తాజా షూటింగ్ షెడ్యూల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోన్నారు. దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్న జాన్వీ, ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేశారు. ఈ మూవీకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి.
సినిమాపై అంచనాలను కూడా పెంచేశాయి. అయితే, అలాంటి పెద్ది సినిమా షూటింగ్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఫ్రెష్ షూటింగ్ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుందట. కోటీ ఆస్పత్రి, వన్ స్టూడియో పరిసరాల్లో ఈ షూట్ నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 4 రోజుల పాటు షూట్ ఉంటుందట. డిసెంబర్ 18 వతేదీ నుంచి ఢిల్లీ షూట్ ప్రారంభం కానుందని అంటున్నారు. ఆ తర్వాత క్లైమ్యాక్స్, ఫైటింగ్, ఐటెం సాంగ్ షూట్ ఉంటుందట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ఈ మూవీ 2026 మార్చి 27వ తేదీన రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
క్లైమాక్స్, ఐటెం సాంగ్ షూటింగ్ వివరాలు
విడుదల తేదీ, ముఖ్య తారాగణం వివరాలు
‘పెద్ది’ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటోంది. క్లైమాక్స్, ఐటెం సాంగ్ మాత్రమే మిగిలి ఉన్నందున, త్వరలోనే సినిమా పూర్తి కానుంది. 2026 మార్చిలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


